Advertisement

సినిమాలకు మాత్రమే బ్రేక్

Samantha joins hands with Sony LIV

 

సమంత ప్రెగ్నెన్సీ తో మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నట్టుగా మా ఇంటి బంగారం సక్సెస్ మీట్ లో ఎనౌన్స్ చేసారు. అంటే నటనకు ఆమె బ్రేక్ ఇవ్వబోతున్నట్టే. కానీ సమంత నటనకు, సినిమాలకు మాత్రమే బ్రేక్ ఇస్తున్నారు. నిర్మాతగా సినిమాలు నిర్మించడంతో పాటుగా ఆమె ఓ టాక్ షో చెయ్యబోతున్నారు.

సోని లివ్ ఓటీటీ కోసం సమంత సరికొత్త  అవతారమెత్తబోతుంది. సో ఆమె ప్రెగ్నెంట్ అయినా ఈ షో కోసం సమయం కేటాయించడమే కాదు.. జిమ్ లో తెగ వర్కౌట్స్ చేస్తూ ఆ వీడియోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొంతమంది సమంత ప్రెగ్నెంట్ గా ఉండి ఇలాంటి హెవీ వర్కౌట్స్ చెయ్యొచ్చా అంటూ మాట్లాడుకుంటున్నారు.

అటు సమంత ప్రెగ్నెంట్ గానే భర్త రాజ్ నిడిమోరు సహాయంతో మా ఇంటి బంగారం కి ప్రోపర్ ప్రమోషన్స్ చేసి విజయాన్ని అందుకుని అటు నటిగా ఇటు నిర్మాతగా మరో మెట్టు ఎక్కేసింది. ఇకపై కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో సమంత ఫుల్ టైమ్ నిర్మాతగా మారబోతున్నట్టుగా  తెలుస్తుంది.

Samantha and Sony LIV collaborate on a new Tamil project