ఇంట్రెస్టింగ్ వీకెండ్ కాదు బోరింగ్ వీకెండ్
Theatrical Releases This Week
ఈ వీకెండ్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అని ఊహించుకున్న ప్రేక్షకులకు ఈ వీకెండ్ ఇంట్రెస్టింగ్ గా కాదు బోరింగ్ అంటూ రెండు సినిమాలు ఆడియన్స్ ని పోటాపోటీగా నిరాశపరిచాయి. ఈ శుక్రవారం ఎన్నో అంచనాల నడుమ విడుదలైన నాగబంధం, రావు బహదూర్ చిత్రాలు రెండు డిజప్పాయింట్ చేసాయి.
అభిషేక్ నామా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన నాగబంధం విజువల్ వండర్ గా ఉండబోతుంది, ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్, భారీ బడ్జెట్ మూవీ అంటూ ఆడియన్స్ లో ఆసక్తి నెలకొనడమే కాదు నాగబంధం చిత్రానికి 80 శాతం బడ్జెట్ థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా రికవరీ అయ్యింది అని స్వయంగా దర్శకుడే చెప్పారు.
కానీ నాగబంధం చిత్రం ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేసింది. విజువల్స్ బావున్నా అవుట్ డేటెడ్ కథ, వీక్ నేరేషన్ అంటూ ఆడియన్స్ పెదవి విరిచారు. ఇక మరో చిత్రం సత్యదేవ్ రావు బహదూర్. సత్యదేవ్ ప్రమోషన్స్, మహేష్ బాబు ఈ చిత్రానికి సపోర్ట్ చెయ్యడం, సోషల్ మీడియాలో పాజిటివ్ ట్వీట్స్ తో మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న రావు బహదూర్ చిత్రాన్ని చూసి ప్రేక్షకులు నిరాశపడుతున్నారు.
ఫస్ట్ హాఫ్ వీక్, సెకండ్ హాఫ్ ఓకే ఓకే , కేవలం క్లైమాక్స్ కోసమే రావు బహదూర్ ని రెండున్నర గంటలు భరించాలంటూ సోషల్ మీడియాలో వస్తన్న రెస్పాన్స్ చూసి ఈ వారం విడుదలైన రెండు చిత్రాలు షెడ్డుకే అని ప్రేక్షకులు ఓపెన్ కామెంట్స్ చేస్తున్నారు.








































