Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Another actress follows Deepika Padukone

దీపికా దారిలో మరో హీరోయిన్

Another actress follows Deepika Padukone


బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె స్పిరిట్ సినిమా విషయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కు పెట్టిన కండిషన్స్ బాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసింది. హీరోయిన్స్ కి ఎనిమిది గంటల పని గంటలు, రాత్రిళ్ళు పని చెయ్యను, అలాగే పారితోషికం విషయంలో ఆమె పెట్టిన కండిషన్స్ కు సందీప్ వంగ ఒప్పుకోకుండా ఆమెను స్పిరిట్ నుంచి తప్పించడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.

ఆతర్వాత అదే కండిషన్స్ పెట్టడంతో ఆమె నుంచి మరో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కల్కి2 నుంచి కూడా దీపికా ను తప్పించారు. ఆ విషయంలో దీపికా పదుకొనె కు కొంతమంది హీరోయిన్స్ బాసటగా నిలిస్తే మరికొంతమంది వ్యతిరేఖించారు. ఇప్పుడు దీపికా దారిలో మరో హీరోయిన్ నడుస్తుంది. ఆమె కాజల్ అగర్వాల్.

తను ఒప్పుకుంటున్న సినిమాలకు పని గంటల విషయంలో నిర్మాతలకు తన కండిషన్ చెబుతున్నాను అని, ఇకపై ఎక్కువసేపు పని చెయ్యలేను అని, ఏకధాటిగా పని చెయ్యలేను, ఆదివారాలు షూటింగ్స్ కి రాలేను అని ఖచ్చితంగా చెబుతున్నాను. ఆ సమయంలో నా బిడ్డతో గడుపుతున్నాను అని కాజల్ చెప్పగా..

మరి పెళ్ళయ్యి, పిల్లలు పుట్టిన హీరోయిన్స్ కి ఇండస్ట్రీలో ఈ విధమైన సపోర్ట్ వస్తుందా అని కాజల్ అని అడిగితె.. పరిస్థితుల్లో నెమ్మదిగా మార్పు వస్తుంది. కార్పొరెట్ రంగంలోనే కాదు అన్ని చోట్ల పని గంటలకు వాల్యూ ఉంది, కానీ సినిమా ఇండస్ట్రీలో ఎందుకు లేదు అంటూ కాజల్ పని గంటలపై స్పందించింది. 

Kajal Aggarwal backs Deepika Padukone’s 8-hour shift demand