ఆదర్శ కుటుంబం పై ఈ వార్తలేల?
An Interesting Episode in Venky's Aadarsha Kutumbam
త్రివిక్రమ్ శ్రీనివాస్-విక్టరీ వెంకటేష్ కలయికలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం చిత్రం షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. అక్టోబర్ 2 న విడుదల డేట్ ఫిక్స్ చేసుకున్న ఆదర్శ కుటుంబం చిత్రం పై కొన్ని వార్తలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటే వెంకీ ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు.
అది ఈమధ్యనే థియేటర్స్ లో విడుదలై మంచి హిట్ అయిన అర్జున్ బ్లాస్ట్ మూవీ బ్లాస్ట్ కి రిఫరెన్స్ ఆదర్శ కుటుంబం, ఆ పోస్టర్ ఈ పోస్టర్ కి ఒకే తేడా, అందులో అంటే బ్లాస్ట్ లో తండ్రి-కూతురు, తల్లి ఉంటే ఈ ఆదర్శ కుటుంబం పోస్టర్ లో భార్యాభర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు, అదే బ్లాస్ట్ చిత్రం రీమేక్ అంటూ ప్రచారం జరిగింది.
ఇప్పుడేమో ఆదర్శక కుటుంబంలో కీలకమైన ట్రైన్ ఎపిసోడ్ సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో ఉన్న ట్రైన్ ఎపిసోడ్ ని ఆదర్శంగా తీసుకున్నారనే మాట సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. మరి త్రివిక్రం శ్రీనివాస్ తన డైలాగ్స్ తోనే ఆడియన్స్ ని కుర్చిలకు అతుక్కునేలా చెయ్యగల సత్తా ఉన్న దర్శకుడు. మరి ఈ ఆదర్శ కుటుంబం ఎలా ప్రెజెంట్ చేస్తారో అనేది చూడాలి.







































