మాస్ హీరో-క్లాస్ హీరో కలిస్తే..
A crazy combo is on the way
ఈమధ్యన చిన్న హీరో లేదు, పెద్ద హీరో లేదు.. కథ నచ్చితే కలిసి పని చెయ్యడానికి అస్సలు వెనకాడడం లేదు. ఇప్పుడు అలాంటి కాంబో ఒకటి సెట్ అయ్యింది అనే వార్త టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో నడుస్తుంది. మాస్ హీరో - క్లాస్ హీరో కలిస్తే ఆ కాంబో పై అంచనాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రవితేజ, శ్రీ విష్ణు ఓ సినిమాలో నటించబోతున్నారని వార్త వైరల్ అవుతోంది. మాస్ మహారాజ్ గా రవితేజ, కామెడీ హీరోగా శ్రీ విష్ణు అభిమానులకు చేరువయ్యారు. స్వాగ్ ఫేమ్ హసిత్ గోలి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోయే మూవీలో రవితేజ-శ్రీ విష్ణు కలిసి నటిస్తున్నారని అంటున్నారు.
ఈ ఏడాదే ఈ సినిమా పట్టాలెక్కి 2027 సంక్రాంతికి కానీ సమ్మర్లో కానీ థియేటర్స్ లోకి తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం రవితేజ, శ్రీ విష్ణు చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని త్వరలోనే ఓ కొలిక్కి వస్తాయని, ఆతర్వాతే ఈ క్రేజీ కాంబో పట్టాలెక్కుతోంది అని తెలుస్తుంది.







































