నాగార్జున గారు ట్విస్ట్ ఇవ్వరు కదా

Lenin power packed trailer arriving

 

పాపం అక్కినేని ఫ్యాన్స్. లెనిన్ విడుదల వాయిదాల విషయంలో ఎంతగా నలిగిపోయారో ఇప్పుడొక ట్వీట్ చూస్తే అర్ధమవుతుంది. ఏజెంట్ తర్వాత పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇవ్వాలని అఖిల్ ఎంత కష్టపడ్డాడో తెలియదు కానీ.. అక్కినేని ఫ్యాన్స్ అఖిల్ కమ్ బ్యాక్ కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే తెలుస్తుంది.

మే 1 లెనిన్ వస్తుంది అని ఆశపడిన అభిమానులను నిరాశపరుస్తూ జూన్ 26 కి లెనిన్ పోస్ట్ పోన్ అన్నారు. క్వాలిటీ విషయంలో మరోసారి వాయిదా వేసి జులై 10 కి లెనిన్ రిలీజ్ అంటూ నాగార్జున అనౌన్స్ చేసారు. ఆతర్వాత ప్రమోషన్స్ లేకుండా సైలెంట్ అవడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మినీ యుద్ధం స్టార్ట్ చేసారు. ఇక జూన్ 30 న లెనిన్ ట్రైలర్ తో అసలుసిసలు ప్రమోషన్స్ మొదలు కాబోతున్నాయనే హింట్ ఇచ్చారు.

దానితో అక్కినేని ఫ్యాన్స్ మనోడు వస్తున్నాడు, ఈసారి గట్టిగా కొడుతున్నాడు, లెనిన్ ట్రైలర్ తో పవర్ ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ అవడం ఖాయం అంటారు అచ్చ రచ్చ చేస్తుంటే మరికొందరు..

లెనిన్ ట్రైలర్  30-06-2026
కనీసం ట్రైలర్ అయినా postpone అవ్వకుండా చూడండి @iamnagarjuna గారు.. మళ్ళీ కొత్త అఖిల్ చూడబోతున్నారు అని 
MARK THE DATE అని twist & tweet వేయకండి... అంటూ నాగార్జున ని అక్కినేని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.

Lenin Trailer on this 30th June!