ఇప్పటికీ చందమామ చందమామే

Kajal Agarwal latest look viral


చందమామ గా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలిన కాజల్ అగర్వాల్ కి ఇప్పుడు పెళ్లయింది. ఒక బాబు. సెకండ్ ఇనింగ్స్ లోను నిత్యం ఏదో ఒక సినిమా లేదంటే వెబ్ సీరీస్ షూటింగ్స్ తో బిజీగానే కనిపిస్తుంది. అటు ఫ్యామిలీ, ఇటు కెరీర్ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూనే ఫిట్ గా ఉండేందుకు జిమ్ లో కష్టపడుతుంది.

తాజాగా కాజల్ అగర్వాల్ స్టైలిష్ లుక్ లో షేర్ చేసిన ఫ్రాక్ ఫొటోస్ చూస్తే వావ్ కాజల్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉన్నావో, ఇప్పుడు అలానే ఉన్నావ్ అంటారు. అంతేకాదు చందమామ చందమామే అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. బాబు పుట్టాక కాస్త ఒళ్ళు చేసిన కాజల్ మళ్లీ వర్కౌట్స్ తో మునుపుటి షేప్ లోకి వచ్చేసింది.

ప్రస్తుతం వెబ్ సీరీస్ తో పాటుగా సీనియర్ హీరో బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. భగవంత్ కేసరి మాదిరి లైట్ రోల్ కాకుండా ఈసారి NBK 111లో బలమైన పాత్ర పోషిస్తుంది కాజల్ అగర్వాల్.

Kajal Aggarwal's Latest Stylish Photoshoot Goes Viral