కావ్య మారన్ - అనిరుద్ పెళ్లి నిజమే
Wedding Bells for Anirudh and Kavya Maran?
కావ్య మారన్ - అనిరుద్ పెళ్లి నిజమే
సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ అంటే పడి చచ్చిపోయే కుర్రాళ్ళు లేరు అంటే నమ్మాలి. అందానికి అందం, బాగా డబ్బున్న వ్యాపారవేత్త. అలాంటి అమ్మాయి అంటే పడి చచ్చిపోయే యూత్ ఎందుకు ఉండరు. కానీ కావ్య మారన్ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ప్రేమలో మునిగితేలుతోంది అనే ప్రచారం ఉంది.
అనిరుద్ రవిచందర్ గతంలో చాలామందితో డేటింగ్ చేసాడు. నటి కీర్తి సురేష్ తో అయితే అనిరుద్ పెళ్లి అంటూ వార్తలు వినిపించాయి. కీర్తి సురేష్ మాత్రం తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని వివాహం చేసుకుంది. కావ్య మారన్ ఫామ్ లోకి వచ్చాక అనిరుద్ తో డేటింగ్ చేస్తున్నాడు, త్వరలోనే పెళ్లి అంటూ ప్రచారం జరుగుతుంది కానీ ఎవరూ కన్ ఫర్మ్ చెయ్యలేదు.
తాజాగా కావ్య మారన్-అనిరుద్ రవిచందర్ ల వివాహం జరగబోతున్నట్టుగా ప్రముఖ నటుడు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. నటుడు వైజీ మహేంద్రన్ కావ్య-అనిరుద్ ల వివాహం విషయం అడగగా.. ఆయన అవుననే సమాధానమిచ్చారు. కావ్య మారన్ ప్రస్తుతం బిజినెస్ విమెన్ గా రాణిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్నాడు, వీరిద్దరు పెళ్లి చేసుకుంటే మ్యూజికల్ బిజినెస్ అవుతుందని ఆయన సరదాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







































