ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rajamouli reveals the Varanasi backdrop

వారణాసి బ్యాక్ డ్రాప్ బయటపెట్టిన రాజమౌళి

Rajamouli reveals the Varanasi backdrop

 

ఎస్ ఎస్ రాజమౌళి వారణాసి చిత్ర అప్ డేట్ ఇవ్వడానికి సమయం తీసుకున్నా.. ఒన్స్ ఒక్కసారి వారణాసి అప్ డేట్స్ స్టార్ట్ చేసాక ఇప్పటివరకు ఆపలేదు. సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల. కానీ ఎప్పటి నుంచో వారణాసి ప్రమోషన్స్ ను రాజమౌళి ప్రోపర్ గా స్టార్ట్ చేసేసారు. మహేష్, పృథ్వీరాజ్, ప్రియాంక, రాజమౌళి ఇలా వారణాసిపై హైప్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు.

వారణాసి టైటిల్ గ్లింప్స్ తోనే బోలెడన్ని విశేషాలు బయటపెట్టిన రాజమౌళి తాజాగా వారణాసి బ్యాక్ డ్రాప్ ని రివీల్ చేసేసారు. ఈ చిత్రం తండ్రి-కొడుకుల భావోద్వేగాలు కేంద్ర బిందువుగా తెరకెక్కుతుంది. తండ్రికొడుకుల అనుబంధం, ఫ్యామిలీ ఎమోషన్ అన్ని ఈ సినిమాలో మిళితమై ఉన్నాయని రాజమౌళి చెప్పుకొచ్చారు.

మీరు ఇప్పటివరకు చూసిన వారణాసి గ్లింప్స్ లో ఎన్నో అంశాలు ఉన్నాయి. వారణాసి సినిమాలో ఆఫ్రికాలోని దట్టమైన అడవులు, అంటార్కిటికాలోని మంచు ప్రాంతాలు, రామాయణంలోని పురాణ గాథాలు, దేవుళ్లు, ఒక ఫాంటసీ వర్డల్ అన్నీ కలిసిన ఒక విజువల్ జర్నీ లా వారణాసి ఉండబోతోంది అంటూ ఆయన వారణాసి పై భీబత్సమైన హైప్ ని పెంచేశారు. 

SS Rajamouli confirms Varanasi will be standalone film