NBK 112 బ్యాక్ డ్రాప్ రివీల్డ్
NBK 112 Backdrop Revealed
అనుకోకుండా కలిసే కొన్ని క్రేజీ కాంబినేషన్స్ అభిమానుల్లోనే కాదు ఆడియన్స్ లోను విపరీతమైన క్యూరియాసిటీ, దానితో పాటుగా అంచనాలు పెంచేస్తాయి. అలాంటి కాంబినేషన్ లో రాబోతున్న నందమూరి నటసింహ బాలకృష్ణ - కొరటాల శివ కాంబో NBK 112 చిత్ర పూజా కార్యక్రమాలు రీసెంట్ గానే నిర్వహించారు.
బాలయ్య స్టయిల్ వేరు, కొరటాల స్టయిల్ ఇరు. వీరి కలయికలో సినిమా అంటే క్రేజీ హైప్ ఉంటుంది. మరి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ తో తన ప్రత్యేకతను చాటుకునే కొరటాల యాక్షన్ హీరో బాలయ్య తో ఎలాంటి నేపథ్యంలో సినిమా తెరకెక్కించబోతున్నారో అనే క్యూరియాసిటీ నందమూరి అభిమానుల్లో నడుస్తుంది.
తాజాగా NBK 112 కథ నేపథ్యంలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. NBK 112 చిత్రం రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కబోతుంది అని .. రాయలసీమ ప్రాంతంలోని నీటి సమస్య పై ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య బాబు పాత్ర మాఫియా నేపథ్యంలో ఉంటుందట.
ఇక ఈ చిత్రం భారీ బడ్జెట్ అంటే రూ.150 నుంచి రూ.200 కోట్ల తో భారీగా తెరకెక్కనున్నట్లుగా, ఆగస్టు నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది అని తెలుస్తుంది.







































