సమంత గుడ్ న్యూస్ లీక్ చేసిన మెగా స్టార్
Megastar's Latest Post Brings Cheer to Samantha Fans
మెగా లీకులు ఎప్పటికప్ప్పుడు మెగా ఫ్యాన్స్ కి సంతోషాన్ని పంచుతుంటాయి. కానీ ఈసారి మెగా లీకులు సమంత ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తాయి. మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల అప్ డేట్స్ ని పబ్లిక్ ప్లేస్ లో లీక్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు హీరోయిన్ సమంత గుడ్ న్యూస్ ని మెగాస్టార్ లీక్ చేశారు.
సమంత ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం జరగడం, మా ఇంటి బంగారం సక్సెస్ సెలెబ్రేషన్స్ లో సమంత బేబీ బంప్ తో కనిపించడం చూసి సమంత గర్భవతి అని అందరూ ఫిక్స్ అవుతున్నా ఎక్కడో ఏదో అనుమానం. కారణం ఈ ప్రెగ్నెన్సీ వార్తలపై రాజ్ నిడిమోరు కానీ, సమంత కానీ క్లారిటీ ఇవ్వకపోవడమే.
తాజాగా మా ఇంటి బంగారం టీం ని తన ఇంటికి ఆహ్వనించి సన్మానించిన చిరు ఈరోజు ఉదయం సోషల్ మీడియా వేదికగా మా ఇంటి బంగారం టీమ్ ని పొగుడుతూ.. శుభాకంక్షాలు తెలుపుతూ.. అలాగే జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత & రాజ్ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు 💐💐💐 అంటూ ట్వీట్ చేసారు.
మరి రాజ్ నిడిమోరుతో వ్యక్తిగత జీవితంలో న్యూ లైఫ్ బిగిన్ చేసిన సమంత ఇప్పుడు రాజ్ నిడిమోరు తో కలిసి ప్రెగ్నెన్సీ క్షణాలను ఆస్వాదిస్తుంది. అదే చిరు లీక్స్ తో బయటపెట్టేసారు అంటూ సమంత అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.







































