బంగారానికి మెగా సపోర్ట్
Mega Congratulations To Maa Inti Bangaaram
గత శుక్రవారం విడుదలైన సమంత మా ఇంటి బంగారం బాక్సాఫీసు దగ్గర దూసుకుపోతుంది. కేవలం మూడు రోజుల్లో రూ.43 కోట్ల గ్రాస్ తీసుకొచ్చిన మా ఇంటి బంగారానికి మెగా సపోర్ట్ దొరికింది. ఈ చిత్రం సక్సెస్ అవడంతో మెగాస్టార్ చిరు మా ఇంటి బంగారం టీమ్ ని తన ఇంటికి ఆహ్వానించి భార్య సురేఖతో కలిసి వారిని సత్కరించారు.
మెగాస్టార్ చిరు సోషల్ మీడియా వేదికగా మా ఇంటి బంగారం పై ట్వీట్ చేస్తూ..
“మా ఇంటి బంగారం“ చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో యాక్షన్, భావోద్వేగాలను అందంగా మేళవిస్తూ వినోదాత్మకంగా దర్శకురాలు నందిని రెడ్డి తనదైన శైలిలో తెరకెక్కించారు.
@Samanthaprabhu2 నటన, ముఖ్యంగా చీరకట్టులో చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇలాంటి వైవిధ్యమైన, మహిళా ప్రాధాన్య చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమకు అవసరం. ఈ విజయానికి సమంత, నందిని రెడ్డి, రాజ్ మరియు మొత్తం చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు.
అలాగే జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత & రాజ్ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు 💐💐💐
#MaaIntiBangaaram అంటూ చిరు మా ఇంటి బంగారం టీమ్ కి శుభాకంక్షాలు తెలిపారు.







































