స‌ర్‌ప్రైజ్- నారా లోకేష్‌తో రామ్ చ‌ర‌ణ్ పోలిక‌!

Ram Charan compared to Nara Lokesh!

ప్రముఖ జాతీయ మీడియా డిబేట్‌లో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఆంధ్రప్రదేశ్ యువ మంత్రి నారా లోకేష్‌ల ప్రస్థానాన్ని పోల్చడం స‌ర్ ప్రైజ్ చేసింది. ``నాలుగు సార్లు ముఖ్య‌మంత్రి అయిన నారా చంద్ర‌బాబు వార‌సుడిగా మీరు స్వ‌యంకృషితో ఎదిగారు. మెగాస్టార్ చిరంజీవి వార‌సుడిగా మీరు కూడా సొంత క‌ష్టాన్ని న‌మ్మ‌కున్నారు. మీ ఇద్ద‌రి మ‌ధ్యా పోలిక ఉంద‌ని భావిస్తున్నారా?`` అంటూ రిప‌బ్లిక్ చానెల్ స‌మ్మిట్ లో హోస్ట్ రామ్ చ‌ర‌ణ్ ని ప్ర‌శ్నించ‌గా అత‌డి నోటి నుంచి `క‌చ్ఛితంగా` అంటూ ఆస‌క్తిక‌ర సమాధానం వెలువ‌డింది.

పొలిటికల్ లెజెండ్ నారా చంద్రబాబు నాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన లోకేష్, కేవలం తండ్రి పేరుపై ఆధారపడకుండా ప్రజాక్షేత్రంలో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. నవ్యాంధ్రను డిజిటల్, సాంకేతిక హబ్‌గా మార్చే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఆయన.. దిగ్గజ కార్పొరేట్ సంస్థలు మరియు పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తూ రాష్ట్రాన్ని అభ్యుదయ పథంలో నడిపిస్తున్నారు. ప్రజా సేవలో తనదైన ముద్ర వేస్తూ... క్షేత్రస్థాయిలో ప్రజలకు అత్యంత రక్షణగా నిలుస్తూ ఒక బలమైన లీడర్‌గా ఆయన రూపాంతరం చెందారు.

మరోవైపు టాలీవుడ్ హిస్టరీలోనే తిరుగులేని మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్, వినోద ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఘనమైన పాన్-ఇండియా మేనియాను సొంతం చేసుకున్న చరణ్, తన అద్వితీయ నటనతో కోట్లాది మంది అంతర్జాతీయ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తూ... క్రియేటివ్ ఫీల్డ్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన చరణ్.. ఇటు లోకేష్ ఇద్దరూ తమ తండ్రుల అపారమైన కీర్తిని గౌరవిస్తూనే, స్వయంకృషితో తమ రంగాల్లో శిఖరాగ్ర స్థానాలకు చేరుకోవడం గమనార్హం.

 

Republic Summit 2026 - Ram Charan compared to Nara Lokesh!