విజయ్ బర్త్ డేకి కూడా డిజప్పాయింట్ చేసారు

Vijay fans disappointed


ఈరోజు జూన్ 22 సీఎం విజయ్ బర్త్ డే. ఆయన సీఎం అయ్యేకన్నా ముందే స్టార్ హీరో. విశేష అభిమాన గణం ఉన్న హీరో విజయ్. సినిమాల్లో నుంచి అలా రాజకీయాల్లోకి వచ్చి ఇలా అధికారం చేజిక్కించుకున్న విజయ్ కి ఈ బర్త్ బర్త్ డే చాలా అంటే చాలా స్పెషల్ అనే చెప్పాలి. సీఎం స్థానంలో ఈరోజు విజయ్ బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకున్నారు.

సినీ, రాజకీయ ప్రముఖులు విజయ్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే విజయ్ బర్త్ డే కి అభిమానులు కాస్త డిజప్పాయింట్ అయ్యారు. కారణం ఆయన లాస్ట్ చిత్రం జన నాయగన్ విడుదల తేదీని మేకర్స్ విజయ్ బర్త్ డే కి అయినా అనౌన్స్ చేస్తారని ఆశ పడ్డారు.

కానీ విజయ్ బర్త్ డే కి అలాంటిదేం జరగలేదు. జన నాయగన్ విడుదల విషయంలో మేకర్స్ సైలెంట్ గా ఉన్నారు. మరి సెన్సార్ సర్టిఫికెట్ రాకుండా సినిమా డేట్ ఇవ్వలేరు. అది ఎప్పటికి రావాలి, ఎప్పుడు జన నాయకుడు ప్రేక్షకుల్లోకి రావాలి.

Vijay fans are expecting a Jana Nayagan update on his birthday