రాక్ వెబ్ సీరీస్ మినీ రివ్యూ
Raakh Web Series Review
ఉత్కంఠ భరిత సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎన్ని వచ్చినా.. మళ్లీ మళ్లీ అలాంటి కథలకే ఆడియన్స్ కనెక్ట్ అవుతూ ఉంటారు. అందుకే ఓటీటీ సంస్థలు కూడా పోటీపడి మరీ సస్పెన్స్ థ్రిల్లర్స్ ని వెబ్ సీరీస్ లుగా మార్చి ఆడియన్స్ కట్టిపడేస్తున్నాయి. ఈ జూన్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ లోకి వచ్చిన రాక్ అనే వెబ్ సీరీస్ ఇప్పుడు ఓటీటీ ప్రపంచాన్ని మాయ చేస్తుంది.
1978లో ఢిల్లీలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ సిరీస్ 8 ఎపిసోడ్స్ గా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. రాక్ ఎలా ఉందొ మినీ సమీక్షలో తెలుసుకుందాం..
రాక్ సీరీస్ మినీ స్టోరీ:
ఢిల్లీ లో ఆర్మీ ఆఫీసర్ కర్నల్ అశోక్ పిల్లలు సుమన్, సోహెల్ రేడియో స్టేషన్ కి వెళుతూ కిడ్నాప్ అవుతారు. దానితో రంగంలోకి దిగిన పోలీసులకు సుమన్, సోహెల్ శవాలుగా కనిపిస్తారు. ఈ టీమ్ ని లీడ్ చేస్తున్న జయ ప్రకాష్ అగ్రెసివ్ గా పిల్లలను కిడ్నాప్ చేసి హత్య చేసినవారిని పట్టుకోవాలనుకుంటాడు. ముంబై నుంచి మర్డర్ చేసి పారిపోయి ఢిల్లీ కి చేరుకున్న కారుడు గట్టిన సైకోలు బాబు(కుమార్) రజ్జోలు చిల్లర దొంగతనాలతో పాటుగా హత్యలు చేస్తుంటారు. మరి రజ్జో, బాబు కి సుమన్, సోహెల్ హత్యలకు సంబంధం ఉందా? జయరప్రకాష్ టీమ్ రజ్జో, బాబు లని ఎలా మట్టుబెట్టింది అనేది రాక్ ఫుల్ స్టోరీ.
స్క్రీన్ ప్లే:
1978 లో ఢిల్లీ నగరాన్ని వణికించిన టీనేజ్ పిల్లల కిడ్నాప్, హత్యల నేపథ్యంలో జరిగిన రియల్ స్టోరీని రాక్ గా దర్శకుడు తెరకెక్కించారు. మొదట్లో కాస్త స్లో గా అనిపించినా చూసేకొద్దీ బోర్ కొట్టకుండా ఎనిమిది ఎపిసోడ్స్ ని సింగిల్ డే లో చూసేలా దర్శకుడు ఈ సీరీస్ ని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించారు. ఢిల్లీ లో ఆర్మీ ఆఫీసర్ పిల్లలనే కిడ్నాప్ చేసి అత్యంత పాశవికంగా చంపేసిన సైకో కిల్లర్స్ ని పట్టుకునేందుకు జయప్రకాష్ అనే పోలీస్ అధికారి ఎదుర్కొన సవాళ్ళను, రజ్జో, బాబు లను పట్టుకునేందుకు పోలీసులు ఎలా కష్టపడ్డారు. ఎలాంటి సీసీ కెమెరాలు, ఫోన్ ట్యాపింగ్స్ లేకుండా పోలీసులు వాళ్ళను ఎలా పట్టుకున్నారు అనేదాన్ని దర్శకుడు చూపించిన విధానం ఆడియన్స్ ను ఆకట్టుకుంది.
ఇంటర్నెట్ యుగంలో దొంగలను, హంతకులను, సైకోలు పట్టుకునేందుకు నిమిషాల మీద ఎలెక్ట్రిక్ పరికరాలు, ఫోన్ లొకేషన్స్, సీసీ కెమెరాలు ఎంతగా ఉపయోగపడ్డాయి, ఆ 1970 లో ట్రంప్ కాల్స్, టెలిగ్రామ్స్ తో పోలీసులు ఇద్దరు సైకోలను ఎలా కనిపెట్టారు అనే విషయాన్ని గ్రిప్పింగ్ గా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
ఎలాంటి లక్ష్యం లేని ఇద్దరు చిల్లరదొంగలు, హత్యలు ఎలా చేసారు, ఎందుకు చేసారు, హత్యలకు మొటివ్ ఏమిటి, నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఒక కుతూహలం ఆడియన్స్ మనసులో ఆందోళన కలిగించడం మొదలుపెడుతుంది. రజ్జో, బాబు లను పోలీస్ అరెస్ట్ చేసి వారికీ ఎప్పుడు శిక్ష వేయిస్తారా అని అన్ని ఎపిసోడ్స్ లో ఎదురు చూసేలా చేసారు. ప్రేక్షకుడు రిమోట్ పక్కనపెట్టకుండా అన్ని ఎపిసోడ్స్ ని సింగిల్ డే లో చూసేంత ఇంట్రెస్ట్ కలిగిన సీరీస్ రాక్.
ఆర్మీ ఆఫర్ గా నటించిన నటుడు, మోనా గా నటించిన సోనాలి బింద్రే, పోలీస్ ఆఫీస్ గా జయప్రకాష్ గా నటించిన అలీ ఫజల్, ముఖ్యంగా హంతకులుగా రజ్జో, బాబు లుగా నటించిన రజ్జో (రమణ్ దీప్ యాదవ్) బాబు (ఆకాశ్ మఖిజా) వారు ఆద్యంతం భయపెట్టారు. పిల్లలు సుమన్, సోహెల్ గా నటించిన ఆర్టిస్ట్ లు ఎమోషల్ గా ఆకట్టుకున్నారు. సినిమాటోగ్రఫీ, నేపధ్య సంగీతం, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని రాక్ సీరిస్ విజయంలో మెయిన్ పిల్లర్స్ గా నిలిచాయి.







































