దేవర ను టచ్ చెయ్యలేని పెద్ది
Devara and Peddi 10 days collections
కొరటాల శివ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన దేవర చిత్రానికి మొదటిరోజు అనుకున్నంతగా హిట్ టాక్ అయితే రాలేదు. మొదటిరోజు దేవర చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. అయినప్పటికి ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా రికార్డ్ లు క్రియేట్ చేయడానికి అభిమానులే కారణం. ఎన్టీఆర్ అభిమానులు దేవర చిత్రాన్ని భుజాన మోసి హిట్ కట్టబెట్టారు.
డివైడ్ టాక్ తో దేవర చిత్రం పది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.466 కోట్ల కలెక్షన్స్ తీసుకొచ్చింది. మరి జూన్ 4 న విడుదలైన పెద్ది చిత్రానికి మొదటి రోజు హిట్ టాక్ వచ్చింది. ఈ టాక్ చూసాక పెద్ది కలెక్షన్స్ పరంగా సంచలనాలు నమోదు చేస్తుంది అనుకున్నారు. కానీ పెద్ది హిట్ టాక్ తో పది రోజుల్లో ఎన్టీఆర్ దేవర చిత్రాన్ని టచ్ కూడా చెయ్యలేకపోయింది.
పెద్ది చిత్రం పది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.378 కోట్ల కలెక్షన్స్ మాత్రమే తీసుకొచ్చింది. ఈ లెక్కల పోస్టర్స్ అన్ని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించినవి. డివైడ్ టాక్ తో దేవర కలెక్షన్స్ కి హిట్ టాక్ తో పెద్ది పది రోజుల కలెక్షన్స్ ని కంపేర్ చేస్తూ అభిమానులు సోషల్ మీడియాలో మినీ వార్ స్టార్ట్ చేసారు.







































