రాకా రిలీజ్ అంత లేటా?

Is Raaka getting delayed?Is Raaka getting delayed?

 

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ 2 పుష్ప 2 తర్వాత చాలా ఫాస్ట్ గా కోలీవుడ్ దర్శకుడు అట్లీ తో రాకా స్టార్ట్ చేసారు. గత ఏడాది మొదలైన అల్లు అర్జున్-అట్లీ కాంబో మూవీ ఫస్ట్ లుక్ ఈ ఏడాది అల్లు అర్జున్ బర్త్ డే కి రివీల్ చేసారు. దానితో పాటుగా రాకా రిలీజ్ డేట్ ఇస్తారని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసారు. కానీ ఇవ్వకపోయేసరికి రాకా 2027 కూడా రాకపోవచ్చు అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇప్పుడు అదే నిజమనేలా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అంతా ముంబైలోనే జ‌రుగుతోంది. నార్త్ ని టార్గెట్ చేస్తూ అట్లీ చాలా షూటింగ్ ముంబై అలాగే దుబాయ్ లో ప్లాన్ చేసాడు. అయితే అల్లు అర్జున్-అట్లీ రాకా చిత్రం 2027 డిసెంబర్ లో వస్తుంది అనుకుంటే అది 2028 కి వెళ్లొచ్చనే వార్త అల్లు ఫ్యాన్స్ లో గుబులు పుట్టిస్తుంది.

అసలు రాకా షూటింగ్ ఎంతవరకు వచ్చింది, షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుంది. దీపికా పదుకొనె తో కీలకమైన సీన్స్ త్వరగా కంప్లీట్ చేస్తున్నారని అన్నప్పటికీ.. అట్లీ ఎంత ఫాస్ట్ గా చిత్రీకరించినా.. వి ఎఫ్ ఎక్స్ వర్క్ కి ఎక్కువ సమయం పడుతూ ఉండడంతో రాకా రిలీజ్ లేట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. 
 

Raaka is all set to release in December 2027