హారర్ సిరీస్‌లోకి నయనతార క్రేజీ ఎంట్రీ!
Nayan to play key role in Kanchana 4కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన హారర్-కామెడీ ఫ్రాంచైజీలలో రాఘవ లారెన్స్ సృష్టించిన `ముని`, `కాంచన` సిరీస్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ సిరీస్‌లో రాబోయే సరికొత్త చిత్రం `కాంచన 4` కి సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లోకి లేడీ సూపర్‌స్టార్ నయనతార ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. లారెన్స్ మార్క్ హారర్, కామెడీ ఎలిమెంట్స్‌కు నయనతార లాంటి అగ్ర కథానాయిక పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.
సాధారణంగా నయనతార విలక్షణమైన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు .. స్టార్ హీరోల పక్కన బలమైన పాత్రలను ఎంచుకుంటారు. అయితే పాపులర్ కమర్షియల్ హారర్ ఫ్రాంచైజీలో అమ్మడు భాగస్వామ్యం కావడం అనేది సిరీస్ రేంజ్‌ను మరింత పెంచుతుంది. నయనతారకు మాస్ ఆడియన్స్‌లో తిరుగులేని మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది.
గతంలో రిలీజ్ అయిన `కాంచన` భాగాలు మాస్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా థియేటర్లకు రప్పించాయి. తాజాగా నాలుగో భాగంలో నయనతార ఎంట్రీ ఖాయమైతే? ప్రాజెక్ట్‌కు పాన్-ఇండియా స్థాయిలో భారీ బిజినెస్ క్రేజ్ .. ఓపెనింగ్స్ లభించడం ఖాయంగా కనిపిస్తోంది.








































