Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kriti Sanon - Shields Rashmika Mandanna

రశ్మికను ఫ్యాన్స్ నుంచి కాపాడిన కృతి

Kriti Sanon - Shields Rashmika Mandanna


రష్మిక మందన్న-కృతి సనన్-షాహిద్ కపూర్ కలయికలో తెరకెక్కిన కాక్ టైల్ 2 చిత్రం ఈ నెల 19 న విడుదల కాబోతుంది. గత కొన్ని రోజులుగా కాక్ టైల్ 2 చిత్రాన్ని రష్మిక, కృతి సనన్, షాహిద్ కపూర్ లు అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. గ్లామర్ గా రష్మిక, కృతి సనన్ లు సినిమాలోనే కాదు ప్రమోషన్స్ లోను పోటీపడుతున్నారు.

తాజాగా కాక్ టైల్ 2 చిత్ర ప్రమోషన్స్ ను పూణే లోని ఓ మాల్ లో ప్లాన్ చేసారు. ఆ మాల్ కి రష్మిక, కృతి, షాహిద్ కపూర్ వస్తున్నారని తెలిసి అభిమానులు కోకొల్లలుగా హాజరయ్యారు. తమకిష్టమైన నటులను చూసేందుకు అభిమానులు బారిగేడ్లు తోసుకుని రావడంతో అక్కడ తొక్కిసలాట వాతావరణం ఏర్పడింది.

దానితో ఈవెంట్ నిర్వాకులు కాసేపు ఆ ఈవెంట్ ని ఆపెయ్యగా.. అక్కడే ఉన్న షాహిద్ అసహనానికి గురయ్యారు. ఆతర్వాత సెక్యూరిటీ, బౌన్సర్లు వారిని బయటకు తీసుకెళ్తుండగా.. మరోవైపు కృతి సనన్ మాత్రం రష్మికను అభిమానుల తాకిడి నుంచి తప్పించడం హాట్ టాపిక్ అయ్యింది. సహనటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడిన కృతి సనన్ ని నెటిజెన్స్ అప్రిశేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Kriti Sanon, Rashmika Mandanna mobbed at Cocktail 2 Pune Promotions