Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Mokshagna Drops New Look, But No Debut Clarity Yet

బాలయ్యా.. బాబు ఎంట్రీ ఎప్పుడయ్యా

Mokshagna Drops New Look, But No Debut Clarity Yet


బాలయ్యా.. బాబు ఎంట్రీ ఎప్పుడయ్యా అంటూ నందమూరి అభిమానులు అడుగుతున్నారు. నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతాడు. నటసింహ వారసత్వాన్ని మోక్షు మొదటి సినిమాతోనే నిలబెట్టాలి.. ఇదే అభిమానుల కోరిక. కానీ మోక్షజ్ఞ హీరోగా ఇంట్రడ్యూస్ అవడానికి తెగ ఆలోచన చేస్తున్నాడు.

రెండేళ్ల క్రితమే మోక్షజ్ఞ మొదటి సినిమా అనౌన్సమెంట్ వచ్చింది, ఆగింది. ఆతర్వాత ఆ అప్రోజెక్టు వివరాలేవీ వినిపించలేదు, అలాగని సెకండ్ మూవీ గురించిన కబురు కూడా లేదు. బాలయ్య బర్త్ డే లు వస్తున్నాయ్, పోతున్నాయి. అయినా మోక్షు జాడ లేకపోయేసరికి అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారు.

ఈ బర్త్ డే కి బాలయ్య కొడుకు మోక్షు విషయం తేల్చేస్తారనుకున్నారు. కానీ బాలయ్య బర్త్ డే వచ్చింది, సెలెబ్రేషన్స్ అయ్యాయి, ఆయన కొత్త సినిమా టీజర్ వచ్చింది, నందమూరి అభిమానులుస్ సంబరాలు చేసుకున్నారు. కానీ వాళ్లలో ఈసారి కూడా మోక్షజ్ఞ తెరంగేట్ర కోరిక అలానే మిగిలిపోయింది.

Nandamuri Balakrishna Son Mokshagna Tollywood Entry