Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Hrithik Roshan All Set To Reunite With Rajinikanth

స్పెష‌ల్ గెస్ట్ ఇంకా మండుతూనే ఉందా?

Hrithik Roshan All Set To Reunite With Rajinikanth

సూపర్‌స్టార్ రజనీకాంత్-  నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో `జైలర్` చిత్రానికి సీక్వెల్‌గా  `జైలర్ 2` త తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ముఖ్యంగా ఈ పార్ట్‌లో ఉండే స్పెషల్ గెస్ట్ రోల్ చుట్టూ  కొంతకాలంగా ఇండస్ట్రీలో విపరీతమైన చర్చ నడుస్తోంది. మొదటి భాగంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి టాప్ స్టార్లు మెరిసి సినిమా స్థాయిని పెంచడంతో సీక్వెల్‌లో కూడా అంతకుమించిన స్టార్ పవర్ ఉంటుందని అందరూ ఆశించారు.

ఈ క్రమంలో ఎందరో స్టార్ల పేర్లు ప్రచారంలోకి వ‌చ్చినా? ఎవరూ ఫైనల్ కాకపోవడంతో దర్శకుడు నెల్సన్ అసలు ఎలాంటి ప్రత్యేక పాత్ర లేకుండానే కథను ముందుకు తీసుకెళ్తున్నారనే వార్తలు కూడా గట్టిగా వినిపించాయి.
తాజాగా ఈ గెస్ట్ రోల్ సస్పెన్స్‌కు సరికొత్త రెక్కలు వచ్చాయి. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ‘జైలర్ 2’లో ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్ పోషించబోతున్నాడంటూ నెట్టింట సరికొత్త ప్రచారం ఊపందుకుంది.

ఇప్పుడీ వార్త ఇటు సౌత్, అటు నార్త్ ఫిల్మ్ సర్కిల్స్‌లో రేకెత్తిస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే రజనీకాంత్ స్వాగ్‌కు తోడు హృతిక్ రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం. ప్యాన్-ఇండియా మార్కెట్‌ను కొల్లగొట్టడానికి బాలీవుడ్ అగ్ర హీరోను రంగంలోకి దించడం నెల్సన్ మార్క్ మాస్టర్ ప్లాన్ కావచ్చు అంటూ ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజాలు తేలాల్సి ఉంది.

 

Hrithik Roshan is set to play a pivotal cameo in Jailer 2