Advertisement

లెనిన్ మళ్లీ పోస్ట్ పోనా..

Is Lenin Postponed From June 26


అఖిల్ అక్కినేని కి టైమ్ అస్సలు బాగోలేదనుకుంటా.. ఆయన న టించిన లెనిన్ చిత్రం ఇప్పటికే మే 1 నుంచి పోస్ట్ పోన్ అయ్యి జూన్ 26 కి షిఫ్ట్ అయ్యింది. జూన్ 26 నే సినిమా రిలీజ్ అంటూ నిర్మాత నాగవంశీ బల్లగుద్ది చెబుతున్నారు, అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో భీభత్సంగా హడావిడి చేస్తున్నారు.

లెనిన్ టీజర్, అలాగే సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో అక్కినేని ఫ్యాన్స్ లెనిన్ రిజల్ట్ పై చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు లెనిన్ మరోసారి పోస్ట్ పోన్ కాబోతుంది అనే వార్త అక్కినేని ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చెయ్యడమే కాదు.. నిర్మాత నాగవంశీ పై ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో నాగవంశీని, దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరిని ఏసుకుంటున్నారు.

జూన్ 26 నుంచి లేని పోస్ట్ పోన్ పక్కా.. ఈ విషయం మేకర్స్ ప్రకటించడమే కాదు కొత్త డేట్ కూడా త్వరలోనే ప్రకటిస్తారు అంటున్నారు. అది నిజమేనేమో.. లెనిన్ పోస్ట్ పోన్ అవుతుందనుకుంటా, అందుకే లెనిన్ ప్రమోషన్స్ ని మేకర్స్ ఆపేశారనే  టాక్ కూడా మొదలైంది. 
 

Lenin Release Delayed Once Again