Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Eva Grover says her inter-faith marriage with Aamir Khan’s stepbrother

నటి వైవాహిక జీవితంలోని చేదు నిజాలు!

Eva Grover says her inter-faith marriage with Aamir Khan’s stepbrother

`రెడీ` , `కుంకుమ్` ధారావాహికల తో ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి ఎవా గ్రోవర్ వ్యక్తిగత జీవితంలోని చీకటి రోజులను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ సవతి సోదరుడైన హైదర్ అలీ ఖాన్‌తో ఆమెకు జరిగిన వివాహం ఆ తర్వాత ఆమె అనుభవించిన గృహ హింస పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. కేవలం 18 రోజుల స్వల్ప పరిచయంతో కనీసం ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోకుండా భావోద్వేగంతో తీసుకున్న పెళ్లి నిర్ణయం తన జీవితాన్ని ఎంతటి ఘోరమైన నరకంలోకి నెట్టిందో ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి .. స్వయంగా ఆమిర్ ఖాన్ కూడా ఈ పెళ్లి వద్దని ముందుగానే హెచ్చరించినా? ఆ క్షణంలో వారి మాటలను బేఖాతరు చేస్తూ  తీసుకున్న తొందరపాటు నిర్ణయమే తన జీవితాన్ని అతలాకుతలం చేసిందని ఎవా గుర్తు చేసుకున్నారు.

పెళ్లయిన కొన్ని రోజులకే భర్త అసలు స్వరూపం బయటపడిందని నిరంతరం శారీరకంగా తనపై దాడులు జరిగే వరకూ పరిస్థితి దిగజారిందని ఎవా కన్నీటిపర్యంతమయ్యారు. ఎప్పటికైనా పరిస్థితి మారుతుందని కుటుంబ బంధం నిలబడుతుంద‌నే ఆశతో ఒక పాపకు జన్మనిచ్చినప్పటికీ వేధింపులు తగ్గకపోగా బిడ్డ పుట్టిన నెల రోజులకే మరింత ఎక్కువయ్యాయి. భరించలేని పరిస్థితుల్లో పసిపాప ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఆమె ఒంటరిగా ఆ ఇల్లు వదిలి బయటకు వచ్చేయాల్సి వచ్చింది.

దాదాపు ఐదేళ్ల పాటు నరకయాతన, మానసిక క్షోభను అనుభవించిన తర్వాత చివరకు ఆమె హైదర్‌తో ఉన్న వైవాహిక బంధాన్ని తెంచుకుని  విడాకులు తీసుకున్నారు. అత్యంత కష్టకాలంలో ఎవాకు తన తోటి నటీనటులు, సీరియల్ యూనిట్ సభ్యుల నుండి మానసిక అండ లభించింది. భర్త వేధించినప్పటికీ ఆమిర్ ఖాన్ తండ్రి దివంగత నిర్మాత తాహిర్ హుస్సేన్,  అత్తగారు షహనాజ్ ఆమెకు పూర్తి మద్దతుగా నిలవడం గమనార్హం. జీవితంలో అత్యంత కీలకమైన వివాహం వంటి విషయాల్లో తీసుకునే తొందరపాటు నిర్ణయాలు  వ్యక్తి జీవితాన్ని ఎంతలా నాశనం చేస్తాయో చెప్పడానికి తన అనుభవమే ఓ సజీవ సాక్ష్యమని ఎవా పేర్కొన్నారు.

Eva Grover On Her Abusive Marriage With Aamir Khan's Step-Brother - He Was Physically Violent