Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> NBK111 glimpse unleashes Balakrishna menacingly

NBK111 - బాలయ్య పవర్ ఫుల్ అవతార్

NBK111 glimpse unleashes Balakrishna menacingly


నందమూరి నటసింహ బాలకృష్ణ బర్త్ డే ఈరోజు. జూన్ 10 న పుట్టిన రోజు చేసుకునే బాలయ్య తన ఇంట్లో ఎలాంటి హడావిడి చేస్తారో తెలియదు కానీ.. ఆయన అభిమానులు మాత్రం బాలయ్య బాబు బర్త్ డే అంటే ప్రాణం ఇచ్చేస్తారు,. నందమూరి అభిమానులు కేక్ కటింగ్స్ తో పాటుగా బాలయ్య కొత్త సినిమాల అప్ డేట్స్ తో సోషల్ మీడియాని ఠారెత్తిస్తారు.

ఈరోజు బాలయ్య బర్త్ డే సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ NBK 111 నుంచి దర్శకుడు గోపీచంద్ మలినేని అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే ఫుల్ మీల్స్ అందించాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న NBK 111 నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్ వదిలారు. టైటిల్ తో పాటుగా టీజర్ వస్తుంది అనుకుంటే అది లేకుండా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అందించారు.

బాలయ్య గ్యాంగ్ స్టార్ గా స్టైలిష్ లుక్ లో రాయల్ ఎన్ ఫీల్డ్ పై ఎంట్రీ ఇచ్చే సీన్స్ కి అభిమానులు విజిల్స్ వెయ్యాల్సిందే. అంతేకాదు బాలయ్య బుల్డోజర్ తో చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఇంకా అదిరిపోయింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో బాలయ్య పై విలన్స్ పై బుల్డోజర్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారనే విషయంలో ఎప్పుడో రివీల్ అయినా ఇప్పుడు ఈ టీజర్ లో అదే హైలెట్ అయ్యింది.

జెసిబి ఎక్కి విలన్స్ ని బాలయ్య రఫ్ ఆడించే ఆ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అదిరిపోయింది. బాలయ్య లుక్స్ నిజంగా యంగ్ లుక్స్ ని తలపించాయి. బాలయ్య పవర్ ఫుల్ కేరెక్టర్, ఆయన యాక్షన్ కి ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకుంటున్నారు.

NBK111 - Balakrishna turns menacing