Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sandhya Mridul's domestic help was refused haircuts at two luxury salons

పని మనుషులైతే హెయిర్‌కట్ చేయరా?

Sandhya Mridul's domestic help was refused haircuts at two luxury salons

సమాజంలో ఎంత ఆధునికత పెరిగినా? మనుషుల మధ్య అంతరాలు .. వర్గ వివక్ష ఇంకా రూపుమాసిపోలేదని నిరూపించే ఓ  బాధాకరమైన ఘటన ముంబైలో వెలుగుచూసింది. ప్రముఖ బాలీవుడ్ నటి సంధ్య మృదుల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఓ వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది.  తన తల్లి ఇంట్లో పని చేసే 26 ఏళ్ల యువతికి జుట్టు కత్తిరించుకోవాలనే చిన్న కోరిక ఉంటే.. ఆమెను తీసుకుని స్థానిక బ్యూటీ సెలూన్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఎదురైన చేదు అనుభవాన్ని సంధ్య తీవ్రంగా ఖండించారు.

ఆమె ఒక సాధారణ ఇళ్లల్లో పనిచేసే వ్యక్తి  అనే కారణం తో ఒకటి కాదు.. ఏకంగా రెండు సెలూన్లు ఆమెకు సర్వీస్ ఇవ్వడానికి నిరాకరించడం సమాజంలో ఇంకా బతికే ఉన్న వివక్షకు అద్దం పడుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సంధ్య వివ‌రించారు. మొదటి సెలూన్ వారు నిరాకరించిన తర్వాత ఆమె తల్లి మరో సెలూన్‌ను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు.

అక్కడ కూడా మొదట ససేమీరా అనడంతో సాధారణంగా ఎవరితోనూ గొడవపడని ఆమె తల్లి ఆ యువతి మనోభావాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో మేనేజ్‌మెంట్‌తో వాదించాల్సి వచ్చింది. అవసరమైతే అదనపు డబ్బులు ఇస్తామని బ్రతిమలాడి, పట్టుబట్టి మొత్తానికి అక్కడ హెయిర్‌కట్ చేయించారు. ఆ తర్వాత ఆ చేదు జ్ఞాపకం నుండి ఆ యువతిని దూరం చేయడానికి  సంధ్య  తల్లి ఆమెను ప్రత్యేకంగా లంచ్ కోసం బయటకు తీసుకువెళ్లారు. ఈ రోజుల్లో కూడా మనుషులను వారి వృత్తిని బట్టి చూస్తూ కనీస గౌరవం ఇవ్వకపోవడం ఏ రకమైన నాగరికత అని సంధ్య ఆవేదన వ్యక్తం చేశారు.
 

Sandhya Mridul's domestic help was refused haircuts at two luxury salons