ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Spirit: Prabhas to thunder with this dialogue

ప్రభాస్ స్పిరిట్ డైలాగ్ లీక్

Spirit: Prabhas to thunder with this dialogue


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న స్పిరిట్ చిత్ర షూటింగ్ హైదరాబాద్ మహానగరంలో జరుగుతుంది. హైదరాబాద్ లోని ఐకానిక్ సింగిల్ స్క్రీన్ విమల్ థియేటర్ లో స్పిరిట్ చిత్రీకరణ చేపట్టారు సందీప్ వంగ. ఈరోజు రాత్రి బాలానగర్ విమల్ థియేటర్ లో జగబోయే నైట్ షూట్ లో ప్రభాస్ పాల్గొంటున్నారు.

రెండు రోజుల నుంచి స్పిరిట్ షూట్ విమల్ థియేటర్ లో జరుగుతుంది. కానీ నిన్న నైట్ ప్రభాస్ షూట్ లో పాల్గొంటున్నారు. అయితే స్పిరిట్ లోని ఓ డైలాగ్ లీక్ అయ్యింది అంటూ దానిని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. 'చట్టాన్ని ఫాలో అవ్వను... నేనే చట్టం!' ప్రభాస్ స్పిరిట్ లో డైలాగ్ చెప్పాడంటూ దానిని వైరల్ చేస్తున్నారు.

ఆ డైలాగ్ నిజమా, కాదా అనేది పక్కనపెడితే ప్రభాస్ ఫ్యాన్స్ ఆ డైలాగ్ చెబుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ చిత్రంలో ఆయనకు జోడిగా త్రిప్తి డుమ్రి నటిస్తుండగా.. వివేక్ ఒబెరాయ్ విలన్ గా కనిపించబోతున్నారు.

Prabhas is powering Spirit at this pace