పెద్ది ఫస్ట్ రివ్యూ

Peddi First Review Out


ఈరోజు సాయంత్రం పెద్ది ప్రీమియర్స్ తో థియేటర్స్ దగ్గర అసలైన హడావిడి మొదలు కాబోతుంది. మరికొద్ది గంటల్లో పెద్ది పాన్ ఇండియా థియేటర్స్ లో విడుదల కాబోతుంది. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ పెద్ది తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని చూడాలని మెగా ఫ్యాన్స్ చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు.

పెద్ది చిత్రంపై భీభత్సమైన అంచనాలున్నాయి. తాజాగా పెద్ది చిత్రం చూసిన కొంతమంది చెబుతున్నమాట ఏమిటి అంటే.. పెద్ది సినిమా ఫస్టాఫ్ సూపర్ గా వచ్చింది, పెద్ది లో వచ్చే సాంగ్స్, రామ్ చరణ్, జాన్వీ కపూర్, జగపతిబాబు నటన మాత్రం హైలెట్ గా నిలుస్తాయి. ఇంకా క్రికెట్ యాక్షన్ సీన్స్ ఫస్టాఫ్ కే హైలెట్ గా నిలుస్తుంది అంటూ చెబుతున్నారు.

కానీ సెకండాఫ్ స్టోరీ కాస్త స్లో అయ్యింది అని, పెద్ది కథ సెకండాఫ్ లో విజయనగరం నుంచి ఢిల్లీ కి చేరుకుంటుంది. అక్కడి నుంచి కథనం కాస్త మందగిస్తుంది. ఎమోషనల్ సీన్స్ కారణంగా స్క్రీన్ ప్లే కాస్త నెమ్మదిగా సాగుతుందని చెబుతున్నారు. ఇక దర్శకుడు బుచ్చి చెప్పినట్టుగా చివరి 30 నిమిషాలు చాలా ఉత్కంఠగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది అంటున్నారు.

ఇదే నిజమైతే పెద్ది సూపర్ హిట్ అవడమే కాదు, బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ కొల్లగొట్టడం ఖాయమని మెగా ఫ్యాన్స్ అప్పుడే సంబరాలు చేసుకుంటున్నారు.

Peddi review out