పండు మాస్టర్ కి ఘోర రోడ్డు ప్రమాదం
Pandu Master met with an accident
బుల్లితెరపై పండు మాస్టర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఈటివి ఢీ డాన్స్ షో తో ఫేమస్ అయిన పండు మాస్టర్ శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, జెమిని టివి, జీ తెలుగు ఇలా ప్రతి ఛానల్ లో చాలా యాక్టీవ్ గా సందడి చేస్తూ కామెడీ చేసే పండు మాస్టర్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయిన విషయం తెలిసి ఆయన అభిమానులు ఆందోళనపడుతున్నారు.
విశాఖ జిల్లా ఆనందపురం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో పండు మాస్టర్ కి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. పండు మాస్టర్ తన డ్యాన్స్ టీమ్‌తో కలిసి తగరపువలసలో జరుగుతున్న అమ్మవారి ఉత్సవాల్లో జరిగిన డాన్స్ ప్రదర్శనలో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో తన టీం లోని ఒకరు అస్వస్థతకు గురి కావడంతో తమ కారుని రోడ్డుపక్కన నిలిపారు.
కారులో నుంచి పండు మాస్టర్ దిగి రోడ్డుపై నిలబడగా.. అటుగా వేగంగా వచ్చిన కోళ్ల వ్యాన్ అదుపుతప్పి పండు మాస్టర్ ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఆతర్వాత ఆ వ్యాన్ కారును కూడా ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్ తీవ్రంగా గాయపడగా, అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆతర్వాత ఆయన్ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించినట్లుగా తెలుస్తుంది.







































