ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rashmika remuneration becomes talking point

15 కోట్ల పారితోషికం రేంజుకు ప్ర‌స్థానం!

Rashmika remuneration becomes talking point

 

భారతీయ చలనచిత్ర రంగంలో నటి రష్మిక మందన్న అసాధారణమైన ఎదుగుదలతో అగ్ర కథానాయికగా నిలిచారు. ఈ బ్యూటీ నటించిన మొదటి కన్నడ చిత్రం `కిరిక్ పార్టీ` 2016లో విడుదలైంది. ఆ తర్వాత 2018లో వచ్చిన `ఛలో` చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆపై `గీత గోవిందం`వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు.

సినిమా రంగంలోకి ప్రవేశించిన కేవలం ప‌దేళ్ల వ్యవధిలోనే, ప్రాంతీయ నటి స్థాయి నుండి ప్రస్తుతం ఒక్కో హిందీ చిత్రానికి ఏకంగా 15 కోట్ల రూపాయల పారితోషికం అందుకునే స్థాయికి ఎదిగారు.

దక్షిణాది చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలలో నటిస్తూ తన మార్కెట్ పరిధిని పెంచుకున్నారు. త‌న‌ ఖాతాలో పుష్ప, యానిమల్, పుష్ప 2, ఛావా వంటి భారీ హిట్లు చేరాయి.

ఈ వరుస విజయాల నేపథ్యంలో ప్రస్తుతం నటిస్తున్న `కాక్ టైల్ 2` చిత్రం కోసం ఏకంగా 15 కోట్ల రూపాయల రేంజులో రెమ్యునరేషన్ అందుకుంటూ పరిశ్రమలో సంచలనం సృష్టించారు. న‌య‌న‌తార లాంటి న‌టి 12 కోట్ల రేంజులో పారితోషికం అందుకున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇప్పుడు న‌య‌న్ ని ర‌ష్మిక మించిపోయింది. 

Rashmika receives her Biggest Remuneration