తెలంగాణ పోలీసులపై పవన్ సెటైర్
Pawan's satire on Telangana Police
జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ ఈరోజు తెలంగాణ లోని హైదరాబాద్ గచ్ఛిబౌలి స్టేడియం లో సభ నిర్వహిచతలపెట్టారు. తెలంగాణ లో జనసేన పార్టీ బలోపేతానికి పవన్ కళ్యాణ్ ఈ మీటింగ్ ని ఏర్పాటు చేసి ఇక్కడి నేతలతో, కార్యకర్తలతో సభ నిర్వహించాలనుకున్నారు.
కానీ తెలంగాణ పోలీసులు పవన్ కళ్యాణ్ జనసేన సభకు అనుమతి నిరాకరించారు. ఈరోజు జూన్ 2 న తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా అల్లర్లు చెలరేగుతాయని, అందుకోసమే ముందస్తు చర్యగా పవన్ కళ్యాణ్ జనసేన సభకు అనుమతులు నిరాకరించగా జనసేన నేతలు సభ నిర్వహించుకోవడానికి అనుమతి కావాలంటూ హై కోర్టుకు వెళ్లారు.
ఇక తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్ మరో ట్వీట్ చేస్తూ తెలంగాణ పోలీసులు పై సెటైర్ వేశారు. ఈరోజు సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల మధ్య జూబ్లీ హిల్స్‌లోని నా ఇంట్లో నేను మీడియా మీట్ లో మాట్లాడతాను.
జనతా దళ్ నాయకులతో విలేకరుల సమావేశం నిర్వహించడానికి తెలంగాణ పోలీసు శాఖ కనీసం నాకు అనుమతి ఇస్తుందని ఆశిస్తున్నాను. చూద్దాం… అంటూ చేసిన ట్వీట్ తెలంగాణ పోలీసులను ఉద్దేశించి చేసిందే అని స్పష్టమవుతుంది.







































