ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Janhvi Kapoor wins hearts with Telugu speech at Peddi Event

పెద్ది ఈవెంట్ కి జాన్వీ స్పీచ్ హైలెట్

Janhvi Kapoor wins hearts with Telugu speech at Peddi Event

 

నిన్న సోమవారం రాత్రి విజయవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. కొంతమంది పెద్ది ఈవెంట్ ప్లానింగ్ బాలేదు. ఓపెన్ గా ఈవెంట్ చేసారు. విజయవాడ వాతావరణం అందరికి తెలుసు. అక్కడి చమటకు యాంకర్ మేకప్ కారిపోయింది అంటూ సెటెరికల్ న్యూస్ లు రాసినా మెగా ఫ్యాన్స్ ఏమాత్రం తగ్గలేదు.

పెద్ది ఈవెంట్ పూర్తయ్యేవరకు ఆ ఉడుకు, చమాటలతోనే ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేసారు. అయితే ఈ ఈవెంట్ లో అన్నిటికన్నా ఎక్కువగా హైలెట్ అయ్యింది మాత్రం బాలీవుడ్ గర్ల్ జాన్వీ కపూర్ తెలుగు స్పీచ్. శ్రీదేవి తెలుగు ప్రేక్షకుల హృదయరాణి. ఆమె కుమార్తె ముంబై లో పుట్టి అక్కడే పెరిగి, అక్కడే కెరీర్ ఆరంభించింది.

ఆమె దేవర తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆమె ఇలా తెలుగు ప్రేక్షకులముందుకు వచ్చింది పెద్ది తోనే అని చెప్పాలి. కానీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందు తెలుగులో మాట్లాడి తన తల్లికి తగ్గ తనయ అనిపించుకునేలా ఆమె చీరకట్టు, తెలుగు స్పీచ్ అన్ని తెలుగు ప్రేక్షకులను బాగా ఆకర్షించాయి. ఆమె తెలుగు ని చాలా స్పష్టంగా మట్లాడుతూ అందరి హృదయాలను దోచుకుంది. 

Janhvi Kapoor Telugu Speech At Peddi Pre Release Event