విజయ్ ప్రత్యర్థి త్రిషకు రూ. 12 కోట్ల ఆఫర్

దక్షిణాది చిత్ర పరిశ్రమలో తిరుగులేని అగ్ర కథానాయికగా దూసుకుపోతున్న త్రిష కృష్ణన్ చుట్టూ ప్రస్తుతం కోలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. తమిళనాడు నూతన ముఖ్యమంత్రి, దళపతి జోసెఫ్ విజయ్‌కు అత్యంత ఆప్తురాలిగా పేరున్న త్రిషకు ఆయన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి, డీఎంకే నేత, ప్రముఖ నిర్మాత ఉదయనిధి స్టాలిన్ ఏకంగా రూ. 12 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చారనే వార్త ఇటు సినిమా పరిశ్రమలోనూ.. అటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర సంచలనంగా మారింది.
విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో.. ఉదయనిధి స్టాలిన్ తన సొంత నిర్మాణ సంస్థ `రెడ్ జైంట్ మూవీస్` బ్యానర్‌పై నిర్మించబోయే ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ కోసం త్రిషను సంప్రదించినట్లు తెలుస్తోంది. సాధారణంగా త్రిష తీసుకునే పారితోషికం కంటే ఇది చాలా ఎక్కువ కావడం, అలాగే విజయ్-త్రిషల మధ్య ఉన్న డేటింగ్ పుకార్ల నేపథ్యంలో సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే నాయికకు ప్రతిపక్ష నేత ఇంతటి భారీ ఆఫర్ ఇవ్వడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ మైండ్ బ్లోయింగ్ ఆఫర్‌ను త్రిష నిర్మొహమాటంగా తిరస్కరించినట్లు చిత్ర పరిశ్రమ సమాచారం. పొలిటికల్ సర్కిల్స్‌లో తీవ్రమైన ఉత్కంఠ నడుస్తున్న ఈ తరుణంలో, ఉదయనిధి స్టాలిన్ బ్యానర్‌లో సినిమా ఒప్పుకుంటే అది తప్పుడు సంకేతాలు పంపుతుందని, ముఖ్యంగా సీఎం విజయ్‌తో ఉన్న వృత్తిపరమైన, వ్యక్తిగత అనుబంధం దెబ్బతినే అవకాశం ఉందని భావించే త్రిష ఈ ప్రాజెక్టును రిజెక్ట్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి.
గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాలు వచ్చినా.. ప్రస్తుత డీఎంకే వర్సెస్ టీవీకే రాజకీయ యుద్ధ వాతావరణంలో త్రిష తీసుకున్న ఈ నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఆఫర్.. దాని తిరస్కరణకు సంబంధించి అటు త్రిష వైపు నుండి కానీ.. ఇటు రెడ్ జైంట్ మూవీస్ నుండి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ డ్రామాపై చర్చ తారాస్థాయికి చేరింది.






































