ప్రేమ విషయంలో తమన్నా వెర్షన్


మిల్కి బ్యూటీ తమన్నా రీసెంట్ గానే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో ప్రేమలో బ్రేకప్ జరిగాక ఆమె కెరీర్ లో బిజీగా అయ్యేందుకు తపన పడుతుంది. అటు బిజినెస్ ఇటు నటన అంటూ తమన్నా హడావిడి చేస్తుంది. తాజాగా తమన్నా ప్రేమ పై చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

యువతకు ప్రేమపై అవగాహన లేదు, నేటి తరం యువతకు రిలేషన్ పై క్లారిటీ లేదు, అందుకే ఆ విషయంలో గందరగోళానికి గురవుతున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది ఒక్కసారి మాత్రమే కాదు, పలుమార్లు పుట్టవచ్చు, అంతేకాకుండా అదే నిజమైన ప్రేమ అని తమన్నా చేసిన ప్రేమ కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నామని, వాళ్ళను నిజంగా ప్రేమించాలని అనిపించినప్పుడు వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి, మన భావాలను ప్రేమించే వారిపై బలవంతంగా రుద్దడం ద్వారా ప్రేమను నిరూపించుకోలేము, ప్రేమ అనేది హావభావాల ద్వారా వ్యక్తపరిచేది కాదని, అంతర్లీనంగా పుట్టే ఒక భావోద్వేగమని తమన్నా చెప్పుకొచ్చింది.

అయితే తమన్నా అవకాశం వచ్చినప్పుడల్లా ప్రేమ, అలాగే దానిని నిలబెట్టుకునే విషయమై చేస్తున్న కామెంట్స్ చూస్తే విజయ్ వర్మ రిలేషన్ లో తమన్నా సఫర్ అవ్వబట్టే ఆమె ఇలాంటి కామెంట్లు చేస్తుంది అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.

TamannaahTamannaah emphasized that love