కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నేతలను జైలులో పెట్టి రాక్షసానందం పొందుతుంది.. అయ్యా చంద్రబాబు గారు.. కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికి మేము మళ్లీ అధికారంలోకి వస్తాం, మా నేతలను అరెస్ట్ చేసి జైల్లో పెడితే మేము ఊరుకుంటామా రివెంజ్ తీర్చుకుంటాం.. చంద్రబాబు మీకు అలాగే మీకు తొత్తులుగా పని చేస్తున్న అధికారులకు వడ్డీతో సహా తిరిగిస్తాం అంటూ జగన్ వార్నింగ్ ఇస్తున్నారు.
అధికారం కోల్పోయాక తమకు ప్రజలు ఓట్లు ఎందుకు వెయ్యలేదో అనేది విశ్లేషించుకోవడం మానేసి, తమ ప్రభుత్వంలో విచ్చలవిడిగా ప్రవర్తించిన నేతలను కూటమి ప్రభుత్వం ఆధారాలతో అరెస్ట్ చేస్తే అదేదో తప్పని జగన్ మోహన్ రెడ్డి వారిని జైలుకెళ్లి పరామర్శించడం తప్ప కార్యకర్తలను, ప్రజలను పట్టించుకోలేదు.
చంద్రబాబు సూపర్ సిక్స్ అమలు చెయ్యడం లేదు, తాము ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాము, మమ్మల్ని అవే పథకాలు గెలిపిస్తాయని జగన్ ధీమా కాబోలు. అందుకే తనకు సెక్యూరిటీ ఇవ్వకుండా, తన పర్యటనకు అనుమతి ఇవ్వకుండా తమ నేతలపై కేసులు పెడుతున్నారంటూ జగన్ చంద్రబాబు కి ఇలా వార్నింగ్ ఇస్తున్నారు.. అంటూ టీడీపీ కార్యకర్తలు జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.