తమన్నా మాజీ లవర్ తో ప్రేమ-ఫాతిమ క్లారిటీ

మిల్కి బ్యూటి తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో ప్రేమాయణం నడిపింది. కొన్నాళ్లపాటు సీక్రెట్ గా డేటింగ్ చేసుకున్న తమన్నా-విజయ్ వర్మ తర్వాత పబ్లిక్ గానే రెస్టారెంట్స్ లో విహారయాత్రలో కనిపించారు. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు అనుకున్న సమయంలో తమన్నా-విజయ్ వర్మ లవ్ కి బ్రేకప్ చెప్పుకుని ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు.
తమన్నా కెరీర్ పై ఫోకస్ పెట్టగా.. విజయ్ వర్మ మరో హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నట్లుగా పుకార్లు షికార్లు చేసాయి. బాలీవుడ్ లో దంగల్ చిత్రంతో ఫేమస్ అయిన ఫాతిమా సనా షేక్ తో విజయ్ వర్మ డేటింగ్ చేస్తున్నాడు, తమన్నాతో బ్రేకప్ అయిన కొద్దిరోజులకే విజయ్ వర్మ ఫాతిమ ప్రేమలో పడ్డాడు అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.
అయితే ఈ విషయమై ఫాతిమా సన షేక్ ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయ్యింది. ప్రేమలో ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ఒకరి కోసం మరొకరు కాంప్రమైజ్ కావాలి. ప్రేమలో పడినప్పుడు మిమ్మల్ని మీరు కోల్పోకుండా మీ బంధాన్ని ముందుకు నడిపించాలి. అప్పుడే ఆ బంధం ఎక్కువ రోజులు కొనసాగుతుంది. అలాంటి వ్యక్తి మాత్రం నా జీవితంలో ఎవరూ లేరు. మంచి వాళ్లు కేవలం సినిమాల్లోనే ఉంటారు అంటూ చెప్పడంతో అందరికి ఓ క్లారిటీ వచ్చింది.
ఫాతిమా ఎవరి ప్రేమలో లేదు ముఖ్యంగా విజయ్ వర్మ ప్రేమలో అస్సలు లేదు, ఇదంతా ఆ మీడియా ఊహాగానాలే అంటూ తమన్నా అభిమానులైతే రిలాక్స్ అవుతున్నారు.
Fatima Sana Shaikh says she is single amid link-up rumours with Vijay Varma
Fatima Sana Shaikh squashes link-up rumours with Vijay Varma







































