Advertisement

ఢీ షో కి జెడ్జి గా కొత్త హీరోయిన్

ఈటీవి లో ప్రసారమయ్యే ఢీ డాన్స్ షో దాదాపుగా 19 సీజన్స్ పూర్తి చేసుకుంది. 20 సీజన్ కి రెడీ అయ్యింది. ప్రతి సీజన్ కి ఎవరో ఒక హీరోయిన్ ని తీసుకొచ్చి గ్లామర్ గా జెడ్జి ప్లేస్ లో కూర్చోబెడుతున్నారు. ప్రియమణి, పూర్ణ, శ్రద్ద దాస్, నిన్నగాక మొన్న హన్సిక..  ఇలా ఫెడవుట్ హీరోయిన్స్ ఢీ డాన్స్ షో లో గ్లామర్ చూపిస్తూ జెడ్జి ప్లేస్ లో డాన్స్ మాస్టర్స్ తో కలిసి పార్టిసిపేట్ చేస్తున్నారు. 

శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, గణేష్ మాస్టర్, ఇప్పుడు విజయ్ బిన్నీ మాస్టర్ ఇలా ఢీ డాన్స్ షో లో జెడ్జి ప్లేస్ లో కూర్చున్నవాళ్ళు ఉన్నారు. అయితే గత సీజన్ లో హీరోయిన్ హన్సిక ఢీ డాన్స్ షో కి వన్ ఆఫ్ ది లేడీ జెడ్జి. హన్సిక డాన్స్, ఆమె గ్లామర్ ఢీ సీజన్ 19 షోకి అదనపు ఆకర్షణగా నిలిచింది. 

ఇప్పుడు ఈ సీజన్ కి మరో హీరోయిన్ వచ్చింది. ఆమె కెరీర్ లో డల్ అయిన రెజీనా కసాండ్ర. సినిమా అవకాశాలు తగ్గుమొహం పట్టడంతో.. ఆమె ఓటీటీ కి ఎంట్రీ కూడా ఇచ్చింది. కానీ వర్కౌట్ అవ్వలేదు. రీసెంట్ గా అజిత్ సినిమాలో విలన్ గా నటించింది. అయినా రెజీనా కి వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఆ హీరోయిన్ ఢీ షోకి జెడ్జి గా మారింది. 

నందు యాంకరింగ్ లో విజయ్ బిన్నీ మాస్టర్ ఒక జెడ్జి గా రెజీనా కాసాండ్రా మరో జెడ్జిగా ఢీ 20 కొత్త సీజన్ స్టార్ట్ అయ్యింది. 

Regina Cassandra and Vijay Binni Master are the Judges in Dhee show

New heroine in Dhee dance show
regina