Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nara Rohith enjoying vacation with his fiance

కాబోయే భార్యతో ఎంజాయ్ చేస్తోన్న హీరో

లేటు వయసులో పెళ్లి పీటలెక్కుతున్న టాలీవుడ్ హీరో నారా రోహిత్.. తనకు కాబోయే భార్య సిరి తో కలిసి వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు, నటనకు బ్రేకిచ్చి భైరవంతో పవర్ ఫుల్ గా కమ్ బ్యాక్ ఇచ్చిన నారా రోహిత్ సోలో హీరోగా చేస్తున్న సుందరకాండ విడుదలకు సిద్ధం అవుతుంది.

ప్రతినిధి 2 లో తనతో పాటు నటించిన సిరి లెల్లా ను ప్రేమించి, నిశ్చితార్ధం చేసుకున్న నారా రోహిత్ కి తండ్రి మరణం విషాదాన్ని నింపింది. తండ్రి చనిపోయిన ఏడాది మాసికం పూర్తయ్యాకే నారా రోహిత్ వివాహం చేసుకోవాల్సి ఉంది. అది ఆక్టోబర్ కి పూర్తి కావడంతో సిరి ని అక్టోబర్ లో వివాహం చేసుకోబోతున్నట్టుగా నారా రోహిత్ భైరవం ప్రమోషన్స్ లోనే రివీల్ చేసాడు. సిరి ఆలోచనలు, తన ఆలోచనలు దగ్గరా ఉండబట్టే ప్రేమ కలిగింది, ప్రేమ ఎప్పుడు పుడుతుందో అనేది ఎవ్వరూ చెప్పలేరు అంటూ నారా రోహిత్ తన ప్రేమ పెళ్లిపై కామెంట్స్ చేసాడు. 

తాజాగా కాబోయే భార్య సిరి లెల్లా తో కలిసి నారా రోహిత్ విదేశీ ట్రిప్ కి వెళ్ళాడు. అక్కడ సిరి తో కలిసి ఎంజాయ్ చేస్తూ కనిపించడమే కాదు ఆ ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

Actor Nara Rohith enjoying vacation with his fiance Siri Lella

Nara Rohith enjoying vacation with his fiance
nara rohith