Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Janhvi Kapoor enjoying vacation with boyfriend

బాయ్ ఫ్రెండ్ తో దొరికిన పెద్ది హీరోయిన్ జాన్వీ

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం ముంబై టు హైదరాబాద్ అంటూ అప్ అండ్ డౌన్ చేస్తుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్, క్రేజీ పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది చిత్రంలో నటిస్తున్న జాన్వీ కపూర్.. ఇక్కడ సౌత్ లోకి దేవర తో అడుగుపెట్టింది. దేవర పాజిటివ్ గా ప్రేక్షకులకు కనెక్ట్ అవడంతో జాన్వీ కపూర్ కి పేరొచ్చింది. ఇప్పుడు చరణ్ తో పెద్ది చిత్రంలో నటిస్తుంది. 

అయితే జాన్వీ కపూర్ ఎప్పటి నుంచో డేటింగ్ లో ఉంది, బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి ముంబై రెస్టారెంట్స్ లోను, వెకేషన్స్ కి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ జాన్వీ కపూర్ ప్రేమపై ఎక్కడా ఓపెన్ అవ్వదు. తాజాగా బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి వెకేషన్ కి వెళ్ళింది. 

ఎవ్వరికి తెలియకుండా ట్రిప్ వేసినా.. జాన్వీ కపూర్-శిఖర్ పహారియా ఇద్దరూ లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న సమయంలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో సంచలంగా మారింది. డేటింగ్ విషయాన్ని దాచినా దాగదు, ఎంత సీక్రెట్ మైంటైన్ చేసినా ఇలా ఓపెన్ అవుతుంటుంది అంటూ జాన్వీ కపూర్ డేటింగ్ పై నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Janhvi Kapoor and boyfriend Shikhar Pahariya were seen together in London

Janhvi Kapoor enjoying vacation with boyfriend
janhvi kapoor