పవన్, చిరు రాజకీయాల్లోకి వచ్చేవారే కాదు

జనసేన నేత నాగబాబు ఎమ్యెల్సీ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పిఠాపురంలో తన మార్క్ చూపించాలని తాపత్రయ పడ్డారు. ఆయన పిఠాపురారం పర్యటనలో హడావిడి చేసినప్పుడు టీడీపీ వర్మ vs జనసేన అన్న రేంజ్ లో గొడవలు జరగడంతో నాగబాబు అప్పటి నుంచి కామ్ గా ఉంటున్నారు. అంతకుముందు జనసేనను అన్ని తానై నడిపించారు.
పవన్ కి అండగా ఉంటున్న నాగబాబు ఆయనే గనక బ్రతికుంటే మాకు రాజకీయాల్లోకి వచ్చే అవసరం వచ్చేది కాదు, మేము సినిమాలు చేసుకుంటూ ఉండేవాళ్ళం అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రజలకు మంచి చెయ్యాలనే తపనతో రాజకీయాలు చేసే వారుండి ఉంటే.. మా అన్నదమ్ములు చిరంజీవి, పవన్ కల్యాణ్‌లు అసలు రాజకీయాల్లోకి వచ్చేవారు కాదు, ఎంచక్కా సినిమాలు చేసుకునేవాళ్ళం అంటూ నాగబాబు మట్లాడడం సెన్సేషన్ అయ్యింది.
ఓ ఇంటర్వ్యూలో నాగబాబు దగ్గర సదరు యాంకర్ వంగవీటి మోహన్ రంగా ప్రస్తావన తీసుకురాగా.. నాగబాబు స్పందిస్తూ.. మోహన్ రంగా గొప్ప నాయకుడు, ఆయన్ని ఇప్పటికి ప్రజలు మర్చిపోలేదు, ఇంకా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మోహన్ రంగా జీవించి ఉంటే, మేము రాజకీయాల్లోకి వచ్చే అవసరం లేదు. పదిమందికి సాయం చేసే గొప్ప నాయకుడు ఉండుంటే.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ కు సొంత పార్టీలు పెట్టాల్సిన అవసరం ఉండేది కాదన్నారు.
తామంతా హాయిగా సినిమాలు చేసుకునేవాళ్లం, ఒకవేళ రంగా ఉండి ఉంటే ఆయనే ఏపీకి సీఎం అయ్యేవారంటూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు.
MLC Nagababu Interesting Comments On Vangaveeti Mohana Ranga
Nagababu On Vangaveeti Mohana Ranga







































