Advertisement

స్టార్ క‌పుల్ విడిపోవ‌డానికి కార‌ణం

`హమ్ దిల్ దే చుకే సనమ్` చిత్రీకరణ సమయంలో సల్మాన్ ఖాన్‌- ఐశ్వ‌ర్యారాయ్ ప్రేమాయ‌ణం మొద‌లైంది. కొన్నేళ్ల పాటు వారి బంధం కొన‌సాగింది. కానీ అక‌స్మాత్తుగా ఐశ్వ‌ర్యా రాయ్ మార్చి 2002లో దానిని ముగించాలని నిర్ణయించుకుంది. స‌ల్మాన్ తో డేట్ ముగింపు దశకు చేరుకుందని పేర్కొంది. షారుఖ్ ఖాన్ నటించిన `చల్తే చల్తే` సినిమా సెట్‌లో సల్మాన్ కోపంతో గొడవ చేయడంతో పరిస్థితి మరింత దిగజారింది. సెట్‌లో ఉన్న దర్శకుడు అజీజ్ మీర్జా ఈ గొడవ కారణంగా షూటింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది.

సల్మాన్ ఖాన్ తన ప్రవర్తనకు షారుఖ్ ఖాన్‌కు క్షమాపణలు చెప్పాడు. అయినా షారుఖ్ సందిగ్ధంలో పడ్డాడు. ఐశ్వర్య రాయ్ కూడా క్షమాపణలు చెప్పింది. కానీ ఐష్ న‌టించాలా వ‌ద్దా అనేదానిని షారుఖ్ చేతుల్లోనే వదిలేసింది. జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత చివరికి ఐశ్వర్య స్థానంలో రాణి ముఖర్జీని తీసుకోవాలని షారూఖ్ నిర్ణయించారు.

తర్వాత కూడా ఐష్ అవ‌కాశాలు కోల్పోయింది. SRK స‌ర‌స‌న‌ నటించాల్సిన చాలా చిత్రాలలో నటించలేదు. వీర్-జారా, చల్తే చల్తే వంటి విజయవంతమైన చిత్రాలతో పాటు ఐదు చిత్రాల నుండి తనను తొలగించడంలో షారుఖ్ ఖాన్ పాత్ర పోషించాడని ఓ టీవీ ఇంట‌ర్వ్యూలో ఐశ్వర్య రాయ్ అంగీకరించింది.

చాలా సినిమాలు క‌లిసి న‌టించాక‌, స‌క్సెస‌య్యాక కూడా షారూఖ్ త‌నను సినిమాల నుంచి తొల‌గించాడ‌ని ఐష్ అన్నారు. సెట్లో జ‌రిగిన దానికి త‌న త‌ప్పు ఏమీ లేక‌పోయినా షారూఖ్ త‌న‌ను తొల‌గించాడు. ఎటువంటి వివ‌ర‌ణ ఇవ్వ‌కుండా త‌న‌ను సినిమాల నుంచి తొల‌గించాడ‌ని ఐష్ వాపోయింది. చ‌ల్తే చ‌ల్తే ప్రాజెక్ట్ నుండి తొలగించిన తరువాత, సెప్టెంబర్ 2002లో ఐశ్వర్య రాయ్ త‌న‌ను సల్మాన్ ఖాన్ శారీరకంగా వేధించాడ‌ని ఆరోపించింది. గ‌త మార్చిలో స‌ల్మాన్ నేను విడిపోయాం.. కానీ అతడు దానిని అంగీకరించలేకపోతున్నాడు. మేము విడిపోయిన తర్వాత, అతడు నాకు ఫోన్ చేసి చెత్తగా మాట్లాడేవాడు. నా సహనటులతో నాకు సంబంధాలు ఉన్నాయని కూడా అతడు అనుమానించాడు. అభిషేక్ బచ్చన్, షారుఖ్ ఖాన్ స‌హా చాలామందితో నాకు సంబంధం ఉందని అనేవాడు. అత‌డు శారీరకంగా హింసించాడు.. ఎటువంటి గుర్తులు లేకుండా హింసించాడు. నేను ఏమీ జరగనట్లు పనికి వెళ్ళేదానిని...అని ఐష్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది.

ఐశ్వర్య రాయ్ సల్మాన్ ఖాన్‌తో త‌న రిలేష‌న్ ని ముగించానని అధికారికంగా  ప్ర‌క‌టించింది. నా శ్రేయస్సు కోసం, నా కుటుంబ ఆత్మగౌరవం కోసం, నేను మిస్టర్ సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేయను. సల్మాన్ ఖాన్ అధ్యాయం నా జీవితంలో ఒక పీడకల. అది ఇప్పుడు ముగిసినందుకు కృతజ్ఞురాలిని.. అని బ‌హిరంగంగా ప్ర‌క‌టించింది. ఐశ్వ‌ర్యారాయ్ త‌ర్వాత అభిషేక్ బ‌చ్చ‌న్ ని ప్రేమించి పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఇక స‌ల్మాన్ మాత్రం క‌థానాయిక‌ల‌తో డేటింగుల‌తో స‌రిపెట్టాడు. మ‌రోవైపు ఐష్‌- స‌ల్మాన్ మ‌ధ్య‌ గొడ‌వ‌ల్లో త‌ల‌దూర్చిన షారూఖ్ తోను స‌ల్మాన్ విభేధించాడు. చాలా కాలం ఆ ఇద్ద‌రూ క‌లిసి లేరు. ఇటీవ‌లే తిరిగి అమీర్ ఖాన్ చొర‌వ‌తో క‌లిసాక ఇప్పుడు క‌లిసి సినిమాలు చేసుకుంటున్నారు! 

ఇక స‌ల్మాన్ తో బ్రేక‌ప్ కి ముందే వివేక్ ఒబెరాయ్ తో ఐశ్వ‌ర్యారాయ్ సంబంధం కూడా పెద్దగా చ‌ర్చ‌ల్లోకొచ్చింది. ఇది స‌ల్మాన్ వ‌ర్సెస్ వివేక్ గొడ‌వ‌ల‌కు దారి తీసింది. స‌ల్మాన్ ప‌బ్లిగ్గా ఒబెరాయ్ కి వార్నింగ్ ఇచ్చాడు. వివేక్ ఒబెరాయ్ కెరీర్ నాశ‌నం అవ్వ‌డానికి స‌ల్మాన్ కార‌ణం అన్న చ‌ర్చా చాలా కాలం కొన‌సాగింది.

When Shah Rukh Khan regretted replacing Aishwarya Rai

Why Did Salman and Aishwarya Break Up
aishwarya rai