Advertisement

అరెరే కంగారులో దీపిక పీఆర్

`క‌ల్కి 2898 ఏడి`లో దీపిక కీల‌క పాత్ర‌ను పోషించిన సంగ‌తి తెలిసిందే. అయితే స్పిరిట్ నుంచి సందీప్ వంగా తొల‌గించిన త‌ర్వాత ఇప్పుడు `క‌ల్కి 2898 ఏడి` సీక్వెల్ నుంచి కూడా తొల‌గించార‌న్న ప్ర‌చారం సాగుతోంది. అయితే దీనిపై దీపిక ప‌దుకొనే పీఆర్ చాలా కంగారుప‌డుతోంది. టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టుల‌న్నీ చాప‌చుట్టుకు పోవ‌డం ఖాయ‌మ‌ని భ‌య‌ప‌డుతున్న‌ట్టు తెలిసింది.

వంగా దెబ్బ‌కు దీపిక పీఆర్ నిజంగా కంగారు ప‌డింది అన‌డానికి ఆధారంగా, ఇప్పుడు ప్ర‌ముఖ హిందీ వెబ్ సైట్ లో ఓ క‌థ‌నం వైర‌ల్ అయింది. ఈ క‌థ‌నం సారాంశం ఇలా ఉంది. దీపిక కేవ‌లం త‌న బిడ్డ‌కు ద‌గ్గ‌ర‌గా ఉండేందుకు ప‌ని గంట‌లు త‌గ్గించ‌మ‌ని కోరింది. అంతూ ద‌రీ లేని షెడ్యూళ్ల‌లో ఉండ‌లేదు!  కానీ టాలీవుడ్ లో ఒక ఇన్ స్టా ఖాతాలో త‌న గురించి త‌ప్పుడు ప్ర‌చారం సాగుతోంది. క‌ల్కి 2 నుంచి తొల‌గించారని రాసారు. నిజానికి క‌ల్కి 2 ప్రారంభం కావ‌డానికి ఇంకో ఏడాది ప‌డుతుంది. పైగా క‌ల్కి క‌థంతా దీపిక చుట్టే తిరుగుతుంది. అలాంట‌ప్పుడు సీక్వెల్ నుంచి ఎలా తొల‌గిస్తారు?

అయినా కంగారేమీ లేదు! అల్లు అర్జున్- అట్లీ కాంబినేష‌న్ లో దీపిక‌ భారీ చిత్రంలో న‌టిస్తోంది. షారూఖ్ కింగ్ లోను అవ‌కాశం అందుకుంది. ఒక ప్రొఫెష‌న‌ల్ కాని న‌టికి ఇలాంటి అవ‌కాశాలు ఎవ‌రు ఇస్తారు? అంటూ ప్ర‌శ్నించే ప్ర‌య‌త్నం చేస్తోంది పీఆర్ వ‌ర్గం. క‌ల్కి 2 నుంచి తొల‌గించ‌లేద‌నే వివ‌ర‌ణ ఇచ్చింది.

కానీ నిజానికి ఇవ‌న్నీ మ్యాట‌ర్స్ కాదు... దీపిక లో హ‌ద్దు మీరిన ఫెమినిజం. ప్రాజెక్ట్ గురించి బ‌య‌ట‌కు చెప్ప‌కూడ‌ద‌నే కాంట్రాక్టును ఉల్లంఘించి ఏ రేటెడ్ మూవీ అంటూ త‌ప్పుడుగా ప్ర‌చారం చేయ‌డం.. దీపిక పీఆర్ చేసిన అతి ప‌ర్య‌వ‌సానం. దాని కార‌ణంగా ఇప్పుడు దీపిక క‌నీసం 50-60 కోట్ల విలువ చేసే ద‌క్షిణాది ప్రాజెక్టులు కోల్పోనుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.  

Deepika Padukone Not Dropped From Kalki 2

Deepika PR in tension
deepika