బ్రో టీజర్ వచ్చేస్తుంది

జులై 28 న విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కలయికలో వస్తున్న బ్రో మూవీ అప్ డేట్స్ తో పవన్ ఫాన్స్ ఫుల్ హ్యాపీ గా కనిపిస్తున్నారు. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ మూవీపై అంచనాలు పెంచాలంటే కొత్తగా ప్లాన్ చెయ్యాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. కాబట్టే పవన్ కళ్యాణ్ సింగిల్ పోస్టర్ ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ తో పవన్ కళ్యాణ్ ఉన్న పోస్టర్స్ వదిలారు.

ఇక ఇప్పుడు టీజర్ ని వదిలేందుకు ప్లాన్ చేస్తున్నారు. బ్రో ది అవతార్ టీజర్ పై సముద్రఖని ఓ ప్లానింగ్ లో ఉన్నారట, అతి త్వరలోనే అంటే మోస్ట్లీ ఈ వీక్ లోనే బ్రో టీజర్ వదలాలని అనుకుంటున్నారట. టీజర్ వర్క్ కూడా నడుస్తుంది, మంచి టైం చూసి త్వరలోనే టీజర్ ని అయితే రిలీజ్ చేస్తామని సముద్రఖని చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ చిత్ర డబ్బింగ్ పనులు కూడా శరవేగంగా కంప్లీట్ కాబోతున్నాయి.

ఈ చిత్రానికి సంబందించిన స్పెషల్ సాంగ్ ని ఊర్వశి రౌతేల్ల మీద ఈ మధ్యనే చిత్రీకరించినట్లుగా తెలుస్తుంది. సాయి ధరమ్ తేజ్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా కనిపించబోతుంది. మరి బ్రో టీజర్ తో మామ అల్లుళ్ళు ఫాన్స్ ని ఎలా ఇంప్రెస్స్ చేస్తారో చూద్దాం.

BRO teaser getting ready

All set for the BRO teaser
bro teaser