ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Fans in love with Pawan Kalyan new looks

పవన్ న్యూ లుక్ తో ఫాన్స్ ఫుల్ ఖుషి

పవన్ కళ్యాణ్ రాజకీయాలనుండి సినిమాల్లోకి కమ్ బ్యాక్ అయ్యాక ఆయన లుక్స్ పై చాలా కంప్లైంట్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నా సరే ఆయన ఫాన్స్ కి నచ్చుతారు. కానీ పాలిటిక్స్ కారణంగా పవన్ ఫిట్ నెస్ మెయింటింగ్ చేయకపోవడంతో ఆయన కాస్త బరువు పెరిగారు. వకీల్ సాబ్, భీల నాయక్ రెండింటిలోనూ పవన్ కళ్యాణ్ సాదా సీదాగానే కనిపించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బెంగుళూర్ నుండి వచ్చిన స్పెషల్ జిమ్ ట్రైనర్ ఆధ్వర్యంలో వర్కౌట్స్ చేస్తూ స్లిమ్ గా మారుతున్నారని అన్నారు.

కానీ పవన్ కళ్యాణ్ లుక్ లో ఎలాంటి మార్పు లేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ OG సెట్స్ లో జాయిన్ అయినప్పటినుండి చాలా స్టైలిష్ గా స్లిమ్ గా కనిపించడం పవన్ ఫాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఏప్రిల్ 18న పవన్ కళ్యాణ్ ముంబై వెళ్లారు. సుజిత్ దర్శకత్వంలో దానయ్య నిర్మాతగా తెరకెక్కుతున్న OG షూట్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా సెట్స్ లోకి ఎంటర్ అయ్యింది.

ఆయన OG సెట్స్ లోకి వెళ్లిన ఫొటోస్, వీడియోని పవన్ ఫాన్స్ బాగా ఎంజాయ్ చేసారు. ఇక ఈ రోజు పవన్ కళ్యాణ్ కారా వ్యాన్ దగ్గర స్టయిల్ గా నించున్న స్టిల్ ని మేకర్స్ వదలడంతో పవన్ ఫాన్స్ ఫుల్ ఖుషీగా ఫీలవుతున్నారు. ఇది కదా మాకు కావాల్సింది.. పవన్ ఇంత స్టైలిష్ గా ఉంటే మాకింకేం కావాలి అంటూ పండగ చేసుకుంటున్నారు.

Pawan Kalyan Latest Pic From The Sets Of OG Went Viral In No Time

Fans in love with Pawan Kalyan new looks
pawan kalyan
og