‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ ‘సభకు నమస్కారం’!

Ram Charan next film Sabhaku Namaskaram

Mon 06th Jul 2020 04:38 PM
ram charan,rrr,sabhaku namaskaram movie,satish,debute director,mega power star  ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ ‘సభకు నమస్కారం’!
Ram Charan next film Sabhaku Namaskaram ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ ‘సభకు నమస్కారం’!
Advertisement

రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో రాజమౌళి భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు, క్రేజ్ ఉంది. అయితే ఇలాంటి పాన్ ఇండియా మూవీ తర్వాత ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో కమిట్ అయ్యాడు. ఎన్టీఆర్ తదుపరి టైటిల్ కూడా అయినను పోయిరావలె హస్తినకు అంటూ ప్రచారం లో ఉంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అయితే రామ్ చరణ్ మాత్రం ఇంతవరకు తన తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చెయ్యకుండా మెగా ఫాన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఆచార్యలో గెస్ట్ రోల్ తప్ప రామ్ చరణ్ నెక్స్ట్ పై ఇంకా సందిగ్దత కొనసాగుతూనే ఉంది.
అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సినిమా తర్వాత మరో ఇంకాస్త హైప్‌తో మరో సినిమా చెయ్యడం ఎందుకు రిస్క్ అందుకే.. కాస్త అంటే ఎలాంటి క్రేజ్ లేకుండా ఓ చిన్న సినిమా చెయ్యాలని రామ్ చరణ్ డిసైడ్ అయ్యాడట. అందుకే ఓ కొత్త దర్శకుడు సతీష్ తో రామ్ చరణ్ కొత్త చిత్రాన్ని ప్రకటించబోతున్నాడట. ఇప్పటికే రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాతి చిత్రాన్ని సతీష్ దర్శకత్వంలో చేయబోతున్నాడని, ఇప్పటికే ఆ టైటిల్ కూడా కన్ఫర్మ్ అని అంటున్నారు. ‘సభకు నమస్కారం’ అంటూ ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రామ్ చరణ్ బడా నిర్మాత దిల్ రాజు తో సినిమా చేయబోతున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత వీలుంటే ఆచార్య లేదంటే ‘సభకు నమస్కారం’ అనబోతున్నాడట రామ్ చరణ్.

Ram Charan next film Sabhaku Namaskaram :

After RRR Mega power Star Ram Charan next Confirmed


Loading..
Loading..
Loading..
advertisement