మహేష్ ఫ్యాన్స్‌కి షాక్ మీద షాక్..!

Sat 23rd May 2020 07:12 PM
super star,krishna,mahesh babu,birthday celebrations,vijaya nirmala,mahesh movie,fans,shock  మహేష్ ఫ్యాన్స్‌కి షాక్ మీద షాక్..!
One more Shock to Mahesh Babu Fans మహేష్ ఫ్యాన్స్‌కి షాక్ మీద షాక్..!
Sponsored links

అందరూ షూటింగ్స్ ఆపుకుని కరోనా లాక్ డౌన్ ని ఇంట్లోనే గడుపుతుంటే... మహేష్ మాత్రం కొత్త సినిమాలేవీ ఒప్పుకోకుండా ఇంట్లో ఫ్యామిలీ తో కరోనా లాక్ డౌన్ టైం ని స్పెండ్ చేస్తున్నాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా హిట్ తర్వాత వంశి పైడిపల్లి సినిమాని ఓకే చేసిన మహేష్ ఎందుకో ఆ సినిమాని ఆపేసాడు. వంశీ సినిమా ఆగిపోయిన మూడు నెలలకి పరశురామ్ చెప్పిన కథకి కి మహేష్ కనెక్ట్ అయ్యాడని వీరి కాంబోలో సినిమా జూన్ నుండి పట్టాలెక్కబోతుంది అంటూ వార్తలొస్తున్నాయి.

అది కూడా మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ కొత్త సినిమా ప్రకటన వస్తుంది అంటూ గత పది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అదే విషయాన్ని మహేష్ పిఆర్ టీం కూడా చెప్పింది. అయితే తాజాగా మహేష్ ఫాన్స్ కి మళ్ళీ షాక్ తప్పేలా లేదు. ఎందుకంటే కృష్ణ ఈసారి పుట్టిన రోజు వేడుకల్ని రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటించారు. దానికి కారణం కరోనా కాదు.... కృష్ణ రెండో భార్య విజయనిర్మల గత ఏడాది మరణించడంతో.,.. ఇంకా ఏడాది పూర్తికాకపోవడంతో కృష్ణ తన పుట్టిన రోజు వేడుకల్ని రద్దు చేసుకున్నట్లుగా తెలిపారు. అందుకే ఈసారి మహేష్ మూవీకి సంబంధించిన ఏ ఒక్క ప్రకటన వెలువడేలా కనిపించడం లేదు.

Sponsored links

One more Shock to Mahesh Babu Fans:

Super star Shock to Super Star Fans

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019