‘సరిలేరు నీకెవ్వరు’.. స్కెచ్ మాములుగా లేదు

Sarileru Neekevvaru Team new Sketch for Movie Promotions

Thu 21st Nov 2019 06:30 PM
sarileru neekevvaru,social media team,mahesh babu,promotions,teaser release  ‘సరిలేరు నీకెవ్వరు’.. స్కెచ్ మాములుగా లేదు
Sarileru Neekevvaru Team new Sketch for Movie Promotions ‘సరిలేరు నీకెవ్వరు’.. స్కెచ్ మాములుగా లేదు
Advertisement

సంక్రాంతి సినిమాల్లో ఒకటైన అల వైకుంఠపురములో సినిమా సాంగ్స్ మార్కెట్‌ని అల్లాడిస్తుంటే.. సరిలేరు నీకెవ్వరు ఫ్యాన్స్ మాత్రం తెగ ఫీలైపోతున్నారు. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా సాంగ్స్ పక్కనబెట్టి.. ముందు టీజర్ వదలడానికి రెడీ అయ్యింది టీం. నవంబర్ 22న సరిలేరు నీకెవ్వరు టీజర్ అంటూ ప్రకటించింది. అయితే సాంగ్స్‌తో భీభత్సమైన క్రేజ్ సంపాదించినా అల వైకుంఠపురములో ముందు సరిలేరు నీకెవ్వరూ సినిమా నిలబెడలేకపోతోంది. అందుకేనేమో మహేష్ ఫ్యాన్స్ ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. సోషల్ మీడియాలో అన్ని రకాలుగా ముందున్న అల వైకుంఠపురముకి షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు మహేష్ ఫ్యాన్స్.

సరిలేరు నీకెవ్వరూ నుండి చిన్న అప్ డేట్ బయటికి వచ్చినా.. దాన్ని నిమిషాల్లో వైరల్ చేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ని గడగడలాడిస్తున్నారు. సరిలేరు పోస్టర్ వదిలినా సరే ట్విట్టర్ లో, ఫేస్ బుక్‌లో ఇలా సోషల్ మీడియాలో దేన్నీ వదలకుండా హంగామా చేస్తున్నారు. ఏలాగైనా సరిలేరు నీకెవ్వరుకి పిచ్చ క్రేజ్ తేవాలని మహేష్ ఫ్యాన్స్ కంకణం కట్టుకున్నారు. రేపు టీజర్ విడుదలైనా సరే క్షణాల్లో టీజర్ కి లైక్స్ మోత మోగించడానికి పక్కా ప్రిపేర్ గా ఉన్నారు. సాంగ్స్ లేకపోతేనేమి.. టీజర్ తో మహేష్ దుమ్ము దులపడం ఖాయమంటూ మహేష్ ఫ్యాన్స్ చేసే హంగామా మాములుగా లేదు.

Sarileru Neekevvaru Team new Sketch for Movie Promotions :

Sarileru Neekevvaru Social Media Team in Full Swing


Loading..
Loading..
Loading..
advertisement