ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Shakeela Sensational Comments in an Interview

23 అప్పుడే అన్నీ చూపించేశా.. ఇప్పుడేం చేయను!

Shakeela Sensational Comments in an Interview

ఒకప్పుడు టాప్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించిన షకీలా.. హీరోయిన్‌గా ఎదగాలని ఆశపడి చివరికి శృంగార తార‌గా మారిపోయింది. ఆ తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమలో శృంగార తారగా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపి.. హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్న షకీలా జీవితం నేటికి ఒడిదుడుకుల ప్రయాణమే. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఒక్కప్పుడు షకీలా సినిమా రిలీజ్ అవుతోందంటే చాలు మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి స్టార్ హీరోలే తమ సినిమాలను వాయిదా వేసుకునే పరిస్థితి ఉండేది. అంతటి స్టార్ట్ డమ్ షకీలాకు మాత్రమే సొంతం. అయితే ఒకప్పటికి ఇప్పటికీ ఆమె జీవితంలో పెనుమార్పులు వచ్చేశాయి. ఒకప్పుడు రోజుకి లక్షల్లో ఆదాయం సంపాదించినా ఆమె, నేడు రోజుకి సరిపడినంత డబ్బు సంపాదించటానికి ఇబ్బంది పడుతోంది. తాజాగా ఓ ప్రముఖ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర, షాకింగ్ విషయాలను బయటపెట్టింది.

‘నన్ను అందరు మోసం చేయడం వల్లే ఇవాళ నాకు ఈ పరిస్థితి వచ్చింది. తల్లి, అక్క, తమ్ముడు ఇలా అందరూ కూడా డబ్బు విషయంలో నాకు అన్యాయం చేశారు. అదే విధంగా నేను ప్రేమించిన వాళ్ళు కూడా నన్ను నమ్మించి నట్టేట ముంచారు. సుమారు ఇప్పటికి ఏడెనిమిది మందితో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేశాను. కానీ ఎవరూ సరైన వాళ్ళని నాకు అనిపించలేదు. అనిపిస్తే ఎప్పుడో పెళ్లి చేసుకునేదాన్ని’ అని చెప్పుకొచ్చింది.

‘‘ఇప్పుడు నా వయసు 43 సంవత్సరాలు. 23లోనే పూర్తిగా ఎక్స్‌పోజింగ్ చేసి మొత్తం చూపించేశాను.. ఇప్పుడిక చూపించడానికి ఏమీ లేదు. ఈ వయసులో మంచి యాక్టింగ్ చూపించాలని అనుకుంటున్నాను. అందుకే సంపూ హీరోగా వస్తున్న‘కొబ్బరి మట్ట’ చిత్రంలో నటించాను’’ అని ఒకింత భావోద్వేగానికి లోనై షకీలా ఈ విషయాలను ఇంటర్వ్యూలో పంచుకుంది.

Shakeela Latest interview Updates

shakeela
actress
interview
sensational comments
interesting comments
shakeela interview