‘కామ్రేడ్’కు అక్కడ కష్టమే!

Wed 24th Jul 2019 07:58 PM
dear comrade,kollywood,competition,vijay deverakonda,nayanthara,santhanam  ‘కామ్రేడ్’కు అక్కడ కష్టమే!
Full Competition to Dear Comrade in Kollywood ‘కామ్రేడ్’కు అక్కడ కష్టమే!
Sponsored links

కొత్త దర్శకుడు భరత్ కమ్మ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక హీరోయిన్ గా నటించిన చిత్రం “డియర్ కామ్రేడ్” ఈనెల 26న గ్రాండ్ గా విడుదల కానుంది. సౌత్‌లో ప్రధాన భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ శుక్రవారం ఈమూవీ తెలుగులో ఎటువంటి పోటీ లేకుండా సోలోగా రిలీజ్ అవుతుంది. కానీ తమిళంలో మాత్రం ఈ సినిమాతో పాటు మరో 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

ఈ 6 లో మెయిన్‌గా స్టార్ కమెడియన్ అయిన సంతానం నటించిన “ఏ1”, అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన “కొలైయుధిర్ కాలం” చిత్రాలు మాత్రమే హైప్ ఉన్న చిత్రాలు. మిగిలినవి అన్ని చిన్న సినిమాలు కావడం విశేషం. మరి ఇంత పోటీ మధ్యన విజయ్ అక్కడ ఎంతవరకు నెట్టుకొస్తాడో చూడాలి. 

ట్రైలర్‌కి ఇప్పటికే అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా రన్ టైం వచ్చేసి 2 గంటల 44 నిముషాలు. కంటెంట్ మీద కాన్ఫిడెన్స్‌తో అంత రన్ టైం ఉన్న పట్టించుకోవట్లేదు మేకర్స్. ఇక ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం హైలైట్‌గా నిలవనుంది.

Sponsored links

Full Competition to Dear Comrade in Kollywood:

Dear Comrade Release on July 26

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019