Advertisement

RRR అప్‌డేట్: ఎన్టీఆర్ లుక్ కోసమేనంట!!

ప్రస్తుతం అరవింద సమేత విజయంతో ఫుల్ ఖుషీలో ఉన్న ఎన్టీఆర్ ఒక నెల రెస్ట్ తీసుకోబోతున్నాడంటూ వార్తలొచ్చినప్పటికీ... సో సో టాకున్న అరవింద సమేతని లేపడం కోసం సినిమా విడుదలయ్యాక కూడా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. సక్సెస్ మీట్, ఛానల్స్ ఇంటర్వూస్, విజయోత్సవ సభ అంటూ హడావిడి చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం కంప్లీట్ గా రెడీ అవుతున్నాడట. అరవింద సమేత కోసం డిఫ్రెంట్ లుక్ కోసం పెద్దగా ట్రై చెయ్యని ఎన్టీఆర్ ఫిట్‌గా అయితే కనబడ్డాడు. కానీ రాజమౌళి మల్టీస్టారర్ కోసం మాత్రం న్యూ లుక్ లోకి ఎన్టీఆర్ మారబోతున్నాడట.

రాజమౌళి దర్శకుడిగా రామ్ చరణ్ - ఎన్టీఆర్‌లు కలిసి బడా మల్టీస్టారర్ ని డివివి దానయ్య నిర్మాణంలో చేయబోతున్నారనే విషయం తెలిసిందే. ఈ సినిమా నవంబర్ 18 నుండి పట్టాలెక్కే ఛాన్స్ ఉందని సమాచారం. అయితే ఈ లోపు ఎన్టీఆర్ న్యూ లుక్ లోకి మారబోతున్నాడని... రామ్ చరణ్ కూడా సిక్స్ ప్యాక్ లుక్ కోసం ఇప్పటికే జిమ్ లో కష్టపడుతున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. ఇక ఎన్టీఆర్, రాజమౌళి సినిమా కోసం జింబాబ్వే కు చెందిన ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ లోయ్డ్ స్టీవెన్స్ తో రాజమౌళి... ఎన్టీఆర్ లుక్ కోసం చర్చించడం జరిగిందట.

ప్రస్తుతం ఉన్న తన నార్మల్ లుక్ ని రాజమౌళి సినిమా కోసమా ఎన్టీఆర్ పూర్తిగా మార్చుకోనున్నాడని చెబుతున్నారు. మరి చరణ్ సిక్స్ ప్యాక్ తో కుమ్మేస్తే... ఎన్టీఆర్ న్యూ లుక్ తో ఇరగదీస్తారన్నమాట. మరి RRR విషయంపై ఎలాంటి న్యూస్ అయిన సెకండ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ సినిమా మీద అంచనాలు ఆసక్తి అలాంటివి మరి. ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి RRR  ప్రీ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై ఉన్నాడని... ఇప్పటికే హీరోల కోసం హీరోయిన్స్ వేట సాగుతుందని త్వరలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పక్కన నటించబోయే హీరోయిన్స్ ని ఫైనలైజ్ చేస్తారని తెలుస్తుంది.

Jr NTR New Look For Rajamouli RRR Film

SS Rajamouli Starts Works for RRR
ss rajamouli
jr ntr
ram charan
rrr
new look