చంద్రబాబు కమ్మ ద్రోహి అట..!

రాజకీయాలు రోజురోజుకి విచిత్రమైన మార్పులు చెందుతూ ఉంటాయి. నిన్నటివరకు కేంద్రంలోని బిజెపి సహాకారంతో టిడిపి నాయకునిగా ఉన్న మోత్కుపల్లి నరసింహులు చంద్రబాబు తనకి గవర్నర్ పదవి ఇప్పిస్తాడని ఎంతో ఆశగా ఉన్నాడు. కానీ బిజెపితో టిడిపికి కటీఫ్ అయిన తర్వాత ఆయన వైఖరిలో పూర్తి మార్పు వచ్చింది. చంద్రబాబునాయుడిని టార్గెట్ చేస్తూ ఆయన విమర్శల పరంపర గుప్పిస్తూ ఉన్నారు.
తాజాగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ద్రోహి. ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచి చంపిన వారిలో చంద్రబాబు ముఖ్యుడు. ఆయన టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూడా కూల్చాలని చూశాడు. కమ్మ కులంలో పుట్టిన నీచుడు చంద్రబాబునాయుడు. కమ్మకులంలో ఆయన చెడపుట్టాడు. తెలుగుదేశం పార్టీ పగ్గాలను నందమూరి వారసులకు అప్పగిస్తే మంచిది. జూనియర్ ఎన్టీఆర్‌తో నందమూరి కుటుంబ సభ్యులందరు కూర్చుని మాట్లాడితే మేము ఆయన్ను గెలిపించడానికి రాష్ట్రాలు రెండింటిలో తిరిగి ప్రచారం చేస్తాం.
ఇక నేను కేసీఆర్‌కి చేసే విన్నపం ఏమిటంటే.. కేసీఆర్ హైదరాబాద్‌లో ఎన్టీఆర్ స్థూపం స్థాపించాలి. నేనే కాదు కేసీఆర్, ఇతర తెలంగాణ ముఖ్యనేతలందరు నాడు ఎన్టీఆర్ తయారు చేసిన వారేనంటూ చంద్రబాబుపై మండిపడటం, కులం ఆధారంగా వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం తీవ్ర చర్చను రేకెత్తిస్తోంది. దీంతో మోత్కుపల్లి చంద్రబాబుల మధ్య దూరం మరింతగా పెరిగిందని చెప్పవచ్చు.
Motkupalli Narasimhulu Sensational Comments on Chandrababu Naidu
Motkupalli Narasimhulu Blasts Chandrababu Naidu






































